కాశ్మీర్ .. ఈ ప్రాంతం కోసం పాకిస్థాన్  భారత్ 70 ఏళ్లుగా శత్రు దేశాలుగా మెలుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సైన్యం అధీనంలో ఉండే ప్రాంతాల్లో ఇది ఒకటి. నిత్యం అలజడులతో, కాల్పులతో అట్టడుగిపోతుంటుంది. ఎప్పుడు ఎవరు ప్రాణం కోల్పోతారో తెలియదు. కాశ్మీర్ లో సైనికుడిగా కాపలా కాయడమంటే చావుతో చెలగాటం ఆడినట్టే ! ఎక్కడ నుంచి ఎప్పుడు ఈ ఉగ్రవాద మూకలు సైన్యం పై విరుచుకుపడతారో తెలియదు. దీనితో కాశ్మీర్ లో కర్ఫ్యూ అనేది సాధారణంగా జరిగే వ్యవహారం. అయితే ఇండియా అధీనంలో పూర్తి కాశ్మీర్ లేని సంగతీ తెలిసిందే. పశ్చిమ భాగంలో ఉన్న కాశ్మీర్ .. దానిని భారత్ ..  పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలిస్తే, పాకిస్టాన్ ..  ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తుంటుంది. దీనిని 1947 లో జవహర్ లాల్ నెహ్రుగా ఉన్నప్పుడు పాకిస్థాన్ ఆక్రమించుకుంది. దీనినే బలూచిస్తాన్ అని కూడా పిలుస్తారు. 


ఈ ప్రాంతం (పాక్ ఆక్రమిత కాశ్మీర్ ) మొత్తం కాశ్మీర్ భూభాగంలో మూడో వంతు ఉంటుంది. అలాగే తూర్పున కొంచెం భూ భాగం చైనా అధీనంలో ఉంటుంది. అయితే నెహ్రు అనాలోచితంగా ఇండియా కోల్పయిన భూభాగాన్ని తిరిగి దక్కించుకోవాలని భారత్ భావిస్తే తిరిగి తెచ్చుకోవటం అంత సులభమా ? ఈ ప్రాంతం 70 ఏళ్ల నుంచి పాకిస్తాన్ అధీనంలో ఉంది. అలాంటింది భారత్ ఎటాక్ చేసి తీసుకోవాలనుకుంటే పాకిస్థాన్ కూడా గట్టిగా పోరాడుతుంది. 


అప్పుడు ఖచ్చితంగా రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదు. ఇంతక ముందు భారత్  పాకిస్థాన్ మధ్య యుద్ధం వచ్చింది గాని ఇప్పుడు వస్తే ఆ ప్రమాదం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే భారత్  పాకిస్థాన్ రెండు కూడా అణ్వస్త్ర దేశాలూ ఒక సారి గాని ఈ న్యూక్లియర్ బాంబులు  రెండు దేశాలు ప్రయోగిస్తే ఏం జరుగుతుంది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పరిస్థితి ఎలా అయిపోయిందో మనకు తెలుసు. కాబట్టి భారత్.. పాకిస్థాన్ ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి తెచ్చుకోవటం కష్టసాధ్యం. 


మరింత సమాచారం తెలుసుకోండి: