భారీగా కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం దగ్గర వరద ఉధృత కొనసాగుతుంది.పోలవరం టూరిజం పాయింట్ దగ్గర ఉంచిన రెండు లాంచీలు నీట మునిగిపోయాయి.మరోవైపు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారిపై ఇంకా వరద నీరు తగ్గలేదు. 19 గిరిజన గ్రామాలు ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కడెమ్మ స్లూయీజ్ బ్రిడ్జ్ కూడా నీటమునిగిపోయింది. బ్రిడ్జి పై నాలుగడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది.




కొత్తూరు గ్రామంలోకి కూడా వరద నీరు చేరింది. కొవ్వూరు దగ్గర గోదావరి ఉధృతి పెరిగింది. గోష్పాదక్షేత్రం నీటమునిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గోదావరి వరద ఉధృతికి పోలవరం వద్ద కూడా వరద తీవ్రంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పోలవరం వద్ద నీటి మట్టం 28  అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పోలవరం టూరిజం పాయింట్ వద్ద ఉంచిన రెండు లాంచీలు కూడ పూర్తిగా మునిగిపోయాయి.




మరోవైపున కొన్ని రహదారులపై వరద నీరు తగ్గలేదు. ఇప్పటికి కూడా మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపధ్యంలో గతం వారం రోజులుగా పోలవరం మండలంలోని ఎగువ ప్రాంతంలో ఉన్న పంతొమ్మిది గిరిజన గ్రామాలకు జల ఇబ్బంది ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్లే మార్గం లేదు. ఈ నేపధ్యంలోనే ఇప్పటికే నాలుగు రోజుల క్రితం జిల్లాకి సంబంధించిన డిప్యూటీ సీఎం, అలానే ఇన్ చార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు కలెక్టర్ అంతా కలిసి,







గిరిజన గ్రామాలకు వెళ్లి వారికి భరోసా కల్పించటంతో పాటు,వారందరికి ప్రభుత్వం నుంచి నిత్యవసర సరుకులు ఇవ్వటం చేశారు. ఈ నేపథ్యంలో వారందరికీ మెరుగైన వైద్యం అందించటానికి అక్కడే ప్రత్యేక ఏర్పాటు చేయటం జరిగింది. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి వారధిగా ఉండే ఎలమంచిలి మండలం కనకాయలంక కాజ్ వే మీద కూడా రెండు నుంచి మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: