తమ ఆధిపత్యం కోసం ఇతర దేశాలను నాశనం చేయడానికి కూడా వెనకాడని అమెరికా మరోసారి తమ బుద్ది ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.ఆసియా లో చైనాని కట్టడి చేయడానికి భారత్ కు దగ్గరైన అమెరికా .ఇప్పుడు భారత్ తమ మాట వినట్లేదని సీరియస్ గా ఉంది.అది చాలదన్నట్టు తమకు చెప్పకుండా భారత్  ఆయుధాల అమ్మకాల వ్యాపారంలో జోరు పెంచడంతో వాటిని అడ్డుకోవడానికి అమెరికా తమ పన్నాగాలకు పదునుపెట్టింది.


దీనికి కారణం ఇప్పటి వరకు ఇతర దేశాలకు తాము చెప్పిన ధరకు ఆయుధాలను ఆంక్షలతో అమ్మి పబ్బం గడుపుతున్న అమెరికాకు భారత్ మేధస్సు గత కొద్దికాలంగా వారు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే భయం పట్టుకుంది.ఇప్పుడు కాని భారత్ ను ఆపకుంటే తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని దిగులు పడుతుంది.అందుకే  నిన్నటి దాకా ఉగ్రదేశం అని పిలిచినా పాకిస్థాన్ కు ఇప్పుడు ఫ్ -16 విమానాలు ఇవ్వడానికి ఒప్పుకుంది.


అలాగే రానున్న కాలంలో భారత్ ను ఆయుధ వ్యాపారం నుండి తప్పించడానికి అవసరమైన కార్యక్రమాలను అమెరికా ఇప్పటికే మొదలు పెట్టింది. ఈ మధ్యకాలంలోనే భారత్ ఒక సబ్ మెరైన్ ను మైన్మర్ దేశానికి అమ్మింది.బ్రహ్మోస్ మిస్సైల్స్ కోసం నాలుగు దేశాలు ఎదురుచూస్తున్నాయి.

దానికి భారత్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.ఇందులో దుబాయ్ వంటి దేశం కూడా ఉండడం గమనార్హంఇప్పుడిప్పుడే అగ్రదేశాలైన అమెరికా,రష్యా,చైనా లు సాధించిన ఘనతలని అతి తక్కువ తో భారత్ పూర్తి చేస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తుంది.మరి అలాంటి భారత్ ఈ అగ్ర దేశాల అడ్డుగా రానున్న కొత్త వ్యాపారాన్ని విజయవంతంగా చేయగలదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: