ఒక సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేయలేదని పవన్ చెబుతున్నారు. నేను అన్నది ఒకటి అయితే దానిని వక్రీకరించి మరొకటిగా మార్చి పుకార్లను రేపుతున్నారని పవన్ చెప్పారు. అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ భీమవరం సభలో తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడినాడని, తెలంగాణ ఉద్యమాన్ని ఒక తాగుబోతు ఉద్యమంగా చిత్రీకరించి భీమవరం సభలో ప్రసంగించినట్టు కొంత మంది ఆరోపిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయలేదని జనసేన నేతలు కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కటంటే మరొకటి తెర మీదకు తీసుకొచ్చారని జనసేన ఆరోపిస్తుంది. 


ఇదే విషయం మీద పవన్ కూడా స్పందించారు. భీమవరం సభలో నేను మాట్లాడింది ఒకటి అయితే దానిని మార్చి మరో విధంగా ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంకా మాట్లాడుతూ నేను భీమవరం సభలో మాట్లాడింది ఐదు రోజుల క్రితం అయితే దానిని ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూన్నారని చెప్పుకొచ్చారు. అయినా భీమవరం సభలో నేను మాట్లాడింది, జగన్ మధ్య పాన నిషేధం గురించి మాట్లాడినాను తప్పితే తెలంగాణ ఉద్యమం గురించి నేను ఎక్కడ మాట్లాడలేదని చెప్పారు. 


నేను .. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా మధ్య పాన నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారని చెప్పానని, మధ్యం అనేది గిరిజనుల సంసృతంలో భాగమని చెప్పానని అది కూడా నేను చెప్పలేదని పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిందే నేను చెప్పానని పవన్ వివరణ ఇచ్చారు. అంతే గాని ఇళ్ల మీదకు వస్తాము.. ఆఫీసుల మీద దాడులు చేస్తామంటే అసలు ఊరుకోనని ఏవైనా రాజకీయాలు చేయాలనుకుంటే బీమవరంకు వచ్చి చేయాలని అంతేగాని పిల్లలు ఉన్న నా ఇంటి మీదకు వస్తానంటే సహించేది లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: