బీజేపీ ప్రభుత్వం ఎంతో తెగించి కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతి పత్తిని రద్ధు చేసింది. దీనితో ఇన్ని రోజులు కాశ్మీర్ లో జరుగుతున్న హింస ఖాండకు చరమ గీతం పాడే అవకాశం ఉందని బీజేపీ చెబుతుంది. కాశ్మీర్ కు విశేష అధికారాలను కేంద్రం తొలిగించడంతో ఇప్పుడు కాశ్మీర్ మీద కేంద్రం పూర్తిగా పెత్తనం చెలాయించవచ్చు. ఇందులో ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే నాటకాలకు తెర  పడిందని చెప్పాలి. ఇప్పుడు కాశ్మీర్ అన్ని కేంద్ర ప్రాంతాల మాదిరి అది కూడా ఒకటి. భారత దేశంలో అమలయ్యే అన్ని చట్టాలు అక్కడ అమలవుతాయి. దీనితో కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిలువరించే అవకాశం భారత్ కు చిక్కింది. ఇన్ని రోజులు పాకిస్థాన్ ఆడిన నాటకాలు ఇక చెల్లవని మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ను హెచ్చరించినట్టయింది.


అయితే పార్లమెంట్ లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కాశ్మీర్ ను ఎలా అయితే కేంద్ర పరిధిలోకి తెచ్చుకున్నామో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను అదే విధంగా తెచ్చుకుంటామని చెప్పడంతో ఒక్క సారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో ఇప్పటికే పాకిస్థాన్ గుండెల్లో అలజడి రేగి ఉంటుందంటే అతిశయెక్తి కాదు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల పాకిస్థాన్ ఇంత వరకు స్పందించలేదు. 


అయితే కేంద్ర ఆర్ధిక మంత్రి చెప్పినట్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను దక్కించుకోవటం సాధ్యమేనా ? అనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి. కాశ్మీర్ అంటే 70 ఏళ్లుగా మన అధీనంలో ఉంది కాబట్టి కేంద్ర పరిధిలోకి తెచ్చుకోగలిగారు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను దక్కించుకోవటం అంటే పూర్తి స్థాయి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరీ పూర్తి స్థాయి యుద్ధం వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: