Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 2:31 pm IST

Menu &Sections

Search

కాశ్మీరు ఎవరిది ?

కాశ్మీరు ఎవరిది ?
కాశ్మీరు ఎవరిది ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇది, కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశము  " మైరా " అనే సంస్కృత పదానికి అర్థము " సరోవరము " అని. ఈ మన్వంతరములోని సప్త ఋషులలో ఒక్కరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మ దేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి, బ్రహ్మ దేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన పదముగ్గురు కుమార్తెలనూ కశ్యప మునికి ఇచ్చి వివాహము చేస్తాడు. 
కశ్యప గోత్రము ఆరంభమయ్యేదే ఇక్కడినుండీ. వీరి సంతానములో , దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు-మొదలుగా సర్వజీవులూ చేరి ఉన్నారు. 
నీలమత పురాణము ప్రకారము, ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశములో ’ సతీసరము ’ అనే అతిపెద్ద సరోవరము ఉండినదంట. శివుడు, సతీదేవి--ఇద్దరికీ అది చాలా ఇష్టమైన సరోవరము అయినందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వారికి బహుమానముగా ఇచ్చినాడు. 


అయితే ఆ సరోవరములో ’ జలోద్భవుడు ’ అనే రాక్షసుడు దాగిఉండి, కశ్యపుడి సంతానానికి వేధింపులు చేసేవాడు. అప్పుడు , కశ్యపుడు, తన కొడుకైన ’ అనంత నాగుడి’ తో కలసి, ఒక వరాహ ముఖము [ ఇప్పటి బారాముల్లా] అనబడు కాలువను తవ్వి, ఆ సరోవరపు నీటిని బయటికి ప్రవహింపజేస్తాడు. 
ఈ విధముగా  ప్రవహించిన నీరు పశ్చిమములోనున్న మరొక కాలువ కు చేరుతుంది. దానిని కశ్యప సాగరము [ ఈనాటి కాస్పియన్ సముద్రము] అని పిలుస్తారు.
ఆ తరువాత సరోవరమునుండీ బయట పడిన జలోద్భవుడిని విష్ణువు సంహరిస్తాడు. 
ఇలాగ  నిండుకున్న సరోవరపు ప్రక్కన ’ వేద వ్యాసంగముల కోసము’ విశేషముగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మిస్తారు. దానిని " కశ్యప మైరా " అని పిలిచేవారు. 
అదే కాలక్రమేణా ’ కశ్య మైరా’ అనీ, " కశ్మీర " అనీ నామాంతరము చెందింది. 


ఈ సుందర కాశ్మీరమును చూచుటకు గౌరీ దేవి, గణపతి తో పాటు హిమాఛ్చాదితమైన ఒక పర్వత మార్గము ద్వారా తరచు వచ్చేది. దానిని " గౌరీ మార్గ " అని పిలిచేవారు. అదే నేటి గుల్మార్గ్ .
’నీలమతి పురాణము ’ మరియూ దాని ఆధారముగా లిఖింపబడిన " రాజతరంగిణి" --ఇవి, కాశ్మీరపు పౌరాణిక మరియూ ఐతిహాసిక దాఖలాలు. 
పన్నెండవ శతాబ్దములో " కల్హణుడు " అనే పండితుడు వ్రాసిన గ్రంధాల శృంఖల , విశ్వములోని అన్ని చోట్లా అత్యంత కుతూహలముతోను, శ్రద్ధాభక్తులతోను అభ్యసించబడుతున్నాయి. 
భారత్ లో దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకొనుట లేదు. ఎందుకంటే , మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీరు పూర్తిగా వేరే.
 కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితి నేడు హిందువులలోనే లేదు. దురదృష్టము...


ఇది ఎవరి కాశ్మీరము ?
ఇది శారదాదేవి యొక్క కాశ్మీరము. 


|| నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని|
త్వామహం ప్రార్థయే నిత్యం  విద్యాదానం చ దేహి మే ||
ఇలాగ శారదా దేవిని స్తుతి చేసేది ’ కాశ్మీర పురవాసిని’ అనే!. 


కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా ?
అది ’ శారదా లిపి ’ 


అప్పటి కాశ్మీర వేద విద్యాలయాలను ఏమని పిలిచేవారు ? ....
" శారదా పీఠము "


ఇదంతా ఎందుకు ,? ఆనాడు పూర్తి కాశ్మీరాన్నే " శారదా దేశము " అని పిలిచేవారు. 
కాకపోతే, శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవారు ....?
అక్కడి కృష్ణగంగా నది యొక్క తీరములోనున్న శారదాపీఠపు సొగసును చూసి, అదే పద్దతిలో దానిని ప్రతిబింబించేలాగ ఇంకొక శారదా పీఠాన్ని తుంగభద్రా తీరపు శృంగేరి లో స్థాపించుటకు ప్రేరణ దొరికినది ఆ కాశ్మీర శారదాపీఠము వల్లనే! 


శారదాదేవి యొక్క శ్రీగంధపు మూల విగ్రహాన్ని కాశ్మీరు నుండే శృంగేరికి తరలించినారట. 
కాశ్మీరానికి తమ కొందరు శిష్యులతోపాటు వెళ్ళిన కొత్తలో శంకరాచార్యులు, ఒక కాశ్మీరీ పండితుడి అతిథిగా ఉన్నారు. 
మొదటి దినమే శంకరాచార్యుల పాండిత్యానికి విస్మయము చెందిన ఆ పండిత దంపతులు, వారిని మరికొంతకాలము తమ అతిథిగా ఉండి సత్కారాలను స్వీకరించమని మనవి చేసుకున్నారట. 
దానికి ఒప్పుకున్న శంకరాచార్యులు, ఒక నిబంధన పెడతారు. ఏమనగా, ’ నా వంట నేనే చేసుకుంటాను ’ అని. ఇది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరముగా తోచిననూ, వారిష్ట ప్రకారమే, కావలసిన సంభారములనూ, వంటపాత్రలు, వంట చెరకు లను ఇచ్చి విరమిస్తారు. అయితే వంట చేయుటకు కావలసిన అగ్నిని ఇవ్వడము మరచిపోతారు. 


మరొకసారి ఆ దంపతులను పిలచి ఇబ్బంది పెట్టరాదని తలచి శంకరాచార్యులు, అలాగే ఆకలితో నకనకలాడుతూనే పడుకుని నిద్రిస్తారు.
 మరునాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి  మాట్లాడిస్తుండగా,  వంట సామగ్రి అంతా అలాగే పడి ఉండుట గమనించి, ’ఎందుకని’ విచారించగా, వారి శిష్యులు, అగ్ని లేని కారణాన శంకరాచార్యులు వంట చేసుకోలేదు-అని సమాధానమునిస్తారు. తక్షణమే ఆ గృహిణి, అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెలమీద చిలకరించగానే ఆ కట్టెలు అంటుకొని మండనారంభిస్తాయి.
ఈ ప్రహసనము వల్ల, శంకరాచార్యులకు, తాము ఇంకా చాలా నేర్చుకోవలసినది ఈ శారదా దేశములో ఉంది--అనిపించి, ఇంకొన్ని దినాలు అక్కడే నివశిస్తారు. వారు నిలచిన ఆ ప్రదేశము--ఒక గుట్ట -ను ఈనాటికీ శంకరాచార్య గుట్ట అనె పిలుస్తారు. ఆ పేరుతోనే అది ప్రసిద్ధమైనది. అదొక పుణ్యక్షేత్రము అనిపించుకున్నది. 


ఇది శ్రీనగరపు నట్ట నడుమ ప్రసిద్ధమైన ’ దాల్ ’ సరోవరపు ప్రక్కనే ఉంది. ఆనాటి శారదాపీఠము , దురదృష్టవశాత్తూ ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది. అక్కడికి వెళ్ళుటకు ఎవరికీ అనుమతి లేదు. [ఈ శారదాపీఠపు శిథిల చిత్రాలు ఈ మధ్యనే ఎవరో పోస్ట్ చేశారు.. ఉన్నవారు పంచుకోగలరు ] 
ఆ శారదా పీఠము శిథిలమై, దినదినానికీ కుంగిపోవుతున్నది. 


" విశిష్టాద్వైతము " అనే సిద్ధాంతము, " నాథ ముని " ద్వారా ప్రారంభమైనది అని ఉల్లేఖనములు ఉన్నాయి. దానిని యమునాచార్యులు విస్తరించినారు.
 మరియూ రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్టులో ప్రతిపాదించి, " శ్రీ భాష్యము " అనె మేరుగ్రంధాన్ని సృష్టించినారు. ఇదే, శ్రీవైష్ణవుల మూలగ్రంధము. ఇటువంటి మహద్గ్రంధాన్ని సృష్టించుటకే రామానుజులు తమ శిష్యుడైన ’ కురుత్తాళ్వార్ ’ [ ఖురేషీ ] తో కలసి బ్రహ్మసూత్రాన్ని వెదకుతూ కాశ్మీరానికి వెళ్ళినారు. వారికి అప్పటికే అరవై యేళ్ళు!


kashmir
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.