ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) పార్టీ మద్య నిషేదంపై ఎన్నికల ముందు వరకు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే... అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుండి దీనిపై కసరత్తు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మొహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. దశలవారీగా మద్యం నిషేధం అమలు చేసేందుకు అడుగులు వెస్తుంది. తొలి విడతగా 20శాతం మద్యం అమ్మకాలను తగ్గించేలా చర్యలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్ ద్వారా మద్యం అమ్మకాలపై విధివిధానాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ బేవరెజేస్ కార్పొరేషన్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు రంగం సిద్ధమైంది.

గతంలో ఒకరు నాలుగైదు మద్యం దుకాణాలు నడిపేవారు. ప్రస్తుతం టెండర్ పద్దతి ద్వారా ఒక వ్యక్తికి ఒక మద్యం దుకాణాన్ని కేటాయించేస్తున్నారు. ఎవరైతే ఎక్కువ మొత్తానికి పాట పాడతారో దానిని సంవత్సరం పాటు ఆ వ్యక్తికి లైసెన్సులు కేటాయిస్తున్నారు. ఇప్పుడు ప్రతి పల్లేటూరులో కూడా మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. దీంతో మద్యం తాగి చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విధానాన్ని మార్చేందుకు జగన్ రంగం సిద్ధం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 4,377 షాపులకు గానూ 3,500 షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం ఉన్న షాపులనే అద్దెకు తీసుకుని కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాల కోసం ప్రతి షాపునకు ఓ సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌లను కార్పొరేషన్ నియమించుకోనుంది. ఈ నియామాకాలన్నీ ఔట్ సోర్సింగ్ పద్ధతిన జరపాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు మద్యం నిషేధంపై ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపించడంతో మద్యం ఎంత మేరు అమ్మకాలు జరుగుతున్నాయో సరైన పద్దతిలో లెక్కలు తెలనున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల ద్వారా కొన్ని లేబుల్ లేకుండా విక్రయాలు చేపడుతున్నారు. ప్రభుత్వం చేతిలో మద్యం దుకాణాలు ఉండటంతో ఇకపై ఎలాంటి అవినీతికి తావు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: