ఈ రోజు మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ .. కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటే పార్టీ అంత ఉత్సాహంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.. అసలు పార్టీ ఎందుకు ఓడిపోయిందో  ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావట్లేదని , 23 సీట్లు మాత్రమే వచ్చేటంత తప్పులు మనం ఏమీ చేయలేదని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు..తాము మొదలుపెట్టిన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి ఇప్పుడు వెలవెలబోతున్నదని  అన్నారు..తమపై కోపంతో అమరావతిని చంపేశారని అన్నారు..విమానాశ్రయాలు తాము ఎంతో అభివృద్ధి చేశామని కానీ ఇప్పుడు విమానాలు అన్నీ ఆగిపోయాయని అన్నారు..


నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానికి అమరావతిలో ఏదో జరిగిందని చెప్పారనీ  కానీ ఇక్కడ జరగని దానికి జరిగిందని చెప్పి నిరూపించలేరు అని చంద్రబాబు అన్నారు..ఢిల్లీ వెళ్లి ప్రధానిని అభివృద్ధి గురించి నిధులు అడగాలి గాని ,తమ హయాంలో ఏదో అవినీతి జరిగిందని దానిపై ఫిర్యాదులు చేయడానికి జగన్ వెళ్లారు అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు..ఇన్నేళ్ల నా అనుభవం లో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని.. అభివృద్ధిని పక్కనపెట్టి ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి గత ప్రభుత్వ హయాంలో జరగని అవినీతిని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేఖరులతో మాట్లాడారు..


ఇదిలా ఉంటే ఒక‌ర‌కంగా చెప్పాలంటే ప్ర‌స్తుతం ఏపిలో ప్ర‌జ‌లు ఎన్నో స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటే వాట‌న్నిటినీ ప‌క్క‌న బెట్టి జ‌గ‌న్ కేవ‌లం ప్ర‌తిప‌క్షాన్ని దుయ్య‌బ‌ట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌పక్క రైతుల స‌మ‌స్య‌లు, మ‌రో ప‌క్క ఇసుక అమ్మ‌కాలు లేక భ‌వ‌న నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. దాంతో సాధార‌ణ కూలీలు చాలా ఇక్క‌ట్లకు గుర‌వుతున్నారు. వీట‌న్నిటీ ప‌క్క‌న పెట్టి అధికార‌మున్న‌ది కేవ‌లం ప్ర‌తిప‌క్షాన్ని త‌ప్పుబ‌ట్ట‌డ‌మే అన్న‌చందంగా అదే ప‌నిలో ఉంటున్నారు ఏపి ముఖ్య‌మంత్రి అని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: