కార్లు మరియు మోటారు  సైకిళ్ల అమ్మకాలు మందగించడం భారతదేశ ఆటో రంగంలో భారీగా ఉద్యోగాల కోత  దిశగా పయనిస్తోంది. ఏప్రిల్ నుండి  ఇప్పటి వరకు  దాదాపు 350,000 మంది  అంచనాల ప్రకారం వాహన తయారీదారులు, విడిభాగాల తయారీదారులు, డీలర్లు,  కార్మికులను తొలగించారు. గత వారంలో‌ మారుతీ‌ సుజుకి కూడా 33% మంది కాంట్రాక్ట్‌  కార్మికులను తొలగించింది.

టాటా మోటార్స్ గత రెండు వారాల్లో నాలుగు ప్లాంట్లలో వారం రోజుల పాటు ఆపేశారు. మహీంద్రా ఏప్రిల్ -జూన్ త్రైమాసికం లో మధ్య వివిధ ప్లాంట్లలో ఉత్పత్తి లేకుండా 5-13 రోజులు ఆపారని తెలిపింది.  జూలై 16 నుండి హోండా రాజస్థాన్‌లోని తన ప్లాంట్‌లో కొన్ని కార్ మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది,  జూలై 26 నుండి 15 రోజుల పాటు  గ్రేటర్ నోయిడాలోని రెండవ ప్లాంట్‌లో తయారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

 పరిశ్రమల అధికారులు భారత ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ‌ సమయం చాలా దారుణమైనదిగా  చెప్తున్నారు ఎందుకంటే ఇది భారతదేశంలో  నిరుద్యోగ సంఖ్య పెంచుతోంది,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది ఒక సవాలుగా నిలువనుంది. గత ప్రభుత్వ హయాం లో‌ కూడా ఇదే సమస్య నెలకోంది అప్పటినుండి పెరుగుతూనే ఉంది .  CMIE (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ)  ప్రకారం, భారతదేశ నిరుద్యోగిత రేటు 2019 జూలైలో 7.51% కి పెరిగింది. ఇది గత సంవత్సరం 5.66% గా ఉండేది.

ఈ రంగాన్ని పునరుద్ధరించడానికి, ఆటో ఎగ్జిక్యూటివ్‌లు బుధవారం జరగనున్న భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో పన్ను తగ్గింపులు మరియు డీలర్లు మరియు వినియోగదారులకు ఫైనాన్సింగ్‌ను సులువుగా పొందాలని డిమాండ్ చేయాలని యోచిస్తున్నట్లు పరిశ్రమల సీనియర్ వర్గాలు తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: