రాజకీయాలంటేనే కామెడీగా మారిపోయాయి. పొద్దున ఒక పార్టీ మధ్యాహ్నం మరో పార్టీ, రాత్రికి ఎక్కడ సర్దుకుంటారో ఎవరికీ తెలియదు. అయారాం, గయారాం కల్చర్ ఇంకా విజయ‌వంతంగా  సాగుతూనే ఉంది. విలువలా వంకాయా అంటున్నారు తలపండిన పొలిటికల్ లీడర్స్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడే కధ నడిపించాలట. ఇదే కదా నయా ట్రెండ్. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ గురించి ప్రచారం చేయడం ఓల్డ్ ట్రెడిషన్. పక్క పార్టీలోకి జంప్ చేసి మాజీ పార్టీ అధినేతను లవ్ చేయడం ఇవాల్టి  నిజమైన  ఇజం. 


ఇవన్నీ ఇలా ఉంచితే ఏపీ రాజకీయాలు సవ్యంగా సాగుతున్నాయా అన్న డౌట్లు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా  జగన్ ఉన్నారు. షరా మామూలుగా  విపక్ష  నేతగా బాబు కుదురుకున్నారు. అయితే తాను ఇంకా సీఎం అనుకోవడమే బాబు స్పెషాలిటీ. తనకు ఎదురులేదని, తిరిగులేదని చెప్పుకుంటున్న చాణక్య  చంద్రబాబుకు అన్నీ తెలుస్తాయి కానీ ఎందుకు ఓడిపోయామో అసలు తెలియదు. అవును వందిమాగధులు మోసిన మాటలు తీయతీయగా ఉంటున్నాయి. అవే నమ్మి బొక్కా బోర్లా పడినా తత్వం బోధపడడంలేదు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీకి.


ఇక జగన్, చంద్రబాబుల మధ్య రాజకీయాలు ఎపుడో పై దాటేశాయి. ఇద్దరి మధ్యన వ్యక్తిగర వైరమే పై చేయి సాధిస్తోంది. జగన్ని తలచుకుంటేనే బాబుకు మంట. బాబును చూస్తేనే జగన్ కి ఇబ్బందిగా మారిన పొలిటికల్ సీన్ ఇది. అందుకే ఒకరిని ఒకరు దారుణంగా దూషించుకుంటారు. ఇక్కడ పదేళ్ళ అనుభవం ఉన్న జగన్ అయినా ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అయినా ఒక్కటే మరి.


జగన్ని పట్టుకుని చంద్రబాబు లేటెస్ట్ గా దున్నపోతు అనేశారు. అంటే డైరెక్ట్ గా అనలేదు కానీ ఆ  పోలిక తెచ్చి మరీ తిట్టేసారు. తాను పాడి ఆవులాంటి వాడినని, గంగిగోవునని అమాయకంగా సొంత డబ్బా కొట్టేసుకున్నారు. మరి తనలాంటి మంచి వాణ్ణి సీఎమ్  గద్దె నుంచి దింపవచ్చా అని బాబు బాధాతప్త హ్రుదయంతో అడుగుతున్నాడు. ఓటర్ల మీదనే నేరుగా నెపం పెడుతున్నారు. తాను వేసిన రోడ్లు నుంచి మరింత ముందుకు వచ్చి తానిచ్చిన నీళ్ళు తాగి తనకే ద్రోహం చేస్తారా అని ఓ రేంజిలో మండిపడుతున్నారు.


ఇక చంద్రబాబు సంగతిలా ఉంటే అసెంబ్లీలో జగన్ కూడా బాబును గాడిదలు కాస్తున్నారా ఈ మధ్యనే   అనేశారు. అయితే ఆయన కూడా డైరెక్ట్ గా  తిట్టలేదు. ఏదో సామెతగా  వల్లించానని చెప్పుకున్నారు. కానీ బాబును గాడిద అంటారా అంటూ ఎమ్మెల్యే తమ్ముళ్ళే పెద్దాయన్ని అలా పోల్చి తెగ బాధపెట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ నేత సీ రామచంద్రయ్య ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు గంగిగోవు కాదు దున్నపోతేనని డైరెక్ట్ అటాక్ చేశారు.


అందువల్లనే ఆయన్ని జనం ఓడించారని కూడా కారణం చెప్పారు. బాబు ఎన్ని విన్యాసాలు చేసినా ఆయన పార్టీకి మరి బతుకు లేదని, ఇది తెలిసే తమ్ముళ్ళు దుకాణం సర్దేస్తున్నారని కూడా వెటకార‌మాడారు. మొత్తానికి దున్నపోతు, గంగిగోవు, గాడిద‌లు కూడా  ఇపుడు ఏపీ పాలిటిక్స్ లోకి కామెడీగా వచ్చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: