తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే భారీ వర్షాల కారణంగా నదులు, కాలవలు నిండిపోగా, వరద నీరు కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. మొన్నటి వరకు గోదారమ్మ పరుగులు తీయగా ఇప్పుడు కృష్ణమ్మ కూడా కలకలలాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది .ఎగువ నుంచి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల డ్యాం నీటి మట్టం కాగా ఇప్పటికే ఎనిమిది వందల ఎనభై అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయటానికి సిద్దపడ్డారు.



ఎగువ ప్రాంతాల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు ఊహించని విధంగా వరద వచ్చి చేరుతోంది. నిన్న సాయంత్రం నుంచి  ఎనభై వేల క్యూసెక్కు లకు పైగా వరద ఉధృతి క్రమంగా పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. నిన్నటి నుంచి కేవలం విపరీతమైన వరద రావడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంది. శ్రీశైలం డ్యాం నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై అడుగులకు చేరుకోగా,పూర్తి స్ధాయి నీటి మట్టం చేరుకోడానికి కేవలం ఐదు అడుగులు మాత్రమే మిగిలి ఉంది. డ్యాం పరిస్తితిని దృష్టిలో పెట్టుకున్న శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ అధికారులు ఇవాళ సాయంత్రం నాలుగు, ఐదు గంటల మధ్యలో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి, పది అడుగుల మేరకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు డ్యాం అధికారులు.నిన్నఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అడుగలకు నీరు ఉండగా, కేవలం ఒక్క రోజులోనే నిన్నటి నుంచి రెండు మూడు అడుగులు పైకి చేరింది.




ఎగువ ప్రాంతాల్లో అధిక వరద వల్ల శ్రీశైలం డ్యాం ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అదే విధంగా ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కూడా వరదల వల్ల ఎటువంటి ఆటంకాలు, సమస్యలూ ఎదురవకుండా  శ్రీశైలం డ్యాం అధికారులు అప్రమత్తమై సాయంత్రం గేట్లను ఎత్తి నీరును  దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కు విడుదల చేసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పది రోజుల క్రితం శ్రీశైలం డ్యాం డెడ్ స్టోరేజి కూడా లేనటువంటి పరిస్తితి. కేవలం పది రోజుల్లోనే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చినటువంటి వరద వల్ల శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని నిండు కుండలా మారింది.



శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలన్నీ  చూస్తే  సముద్రంలో ఎలా ఐతే అలలుంటాయో అదే విధంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది.నిండు కుండలా మారిన శ్రీశైలం డ్యాం అదే విధంగా సాయంత్రం ఎత్తేటువంటి గేట్లను, కృష్ణమ్మ పరవళ్లుని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు. ఈ గేట్లు ఎత్తినప్పుడు ఉండేటువంటి అందాన్ని చూడటానికి పర్యటకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: