వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి ఈ రోజుకు అక్షరాలా 72 రోజులైంది. ఈ కొద్ది రోజులలోనే జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో జనం మెచ్చుకున్నవే ఎక్కువ. అయితే కొన్ని నిర్ణయాలు మాత్రం వివాదాస్పదమయ్యాయి. అందులో ప్రజా  వేదిక కూల్చ‌డం ఒకటి. దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్త‌మైతే టీడీపీ అనుకూల మీడియా  చిరిగి చేటను చేసింది.


ఇక జగన్ పోలవరం విషయంలో కాంట్రాక్టును రద్దు చేయడం, విద్యుత్తు కొనుగోళ్ళ టెండరింగ్  విషయంలో రివ్యూలు చేస్తాననడం వంటివి కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బందిని కలిగించేవే. అదే సమయంలో అమరావతి రాజధాని విషయంలోనూ జగన్ విచారేణకు ఆదేశించడం లాంటివి ఉన్నాయి. వీటిని వివాదం అనలేం కానీ టీడీపీ రచ్చ చేసి వివాదం చేసింది.మరి దీని మీద జగన్ ఏమనుకున్నారో ఏమో కానీ ఈ రోజు విజయవాడలో జరిగిన పెట్టుబడుల సదస్సులో మనసు విప్పి మాట్లాడారు. తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైనప్పటికీ ప్రజల శ్రేయస్సు ద్రుష్ట్యా మంచివేనని జగన్ అన్నారు.


అదే సమయంలో విద్యుత్ కొనుగోళ్ళ టెండరింగ్ విషయాన్ని జగన్ ప్రస్తావించి తక్కువ ధరకు  కోట్ చేసే సంస్థలను పిలవడం ద్వారా విద్యుత్ ధర తగ్గితే అది ప్రజలకు మాత్రమే కాదు, పారిశ్రామిక వేత్తలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. తాను తీసుకుంటున్నవి విప్లవాత్మమైన నిర్ణయాలను అంటూ జగన్ సమర్ధించుకున్నారు. వివాదాస్పద నిర్ణయాలు అని ప్రచారంలోకీ రావడం పట్ల జగన్ ఈ వేదిక మీద నుంచి సరైన సమాధానం చెప్పారనుకోవాలి. గట్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏపీ సర్వతోముఖాభివ్రుధ్ధికి బాటలు వేస్తున్నామని జగన్ అన్నారు.


మొత్తానికి జగన్ సర్కార్ నిర్ణయాలపై గత కొంతకాలంగా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న రచ్చకు, పసుపు తమ్ముళ్లు వేస్తున్న రంకెలకు జగన్ ఇలా  గట్టి జవాబు ఇచ్చారనుకోవాలి. ఇక పారిశ్రామికవేత్తలు ఏం కోరితే అది ఇస్తామంటూ జగన్ చేసిన ప్రకటన కూడా పారిశ్రామిక వర్గాల్లో ఆనందం కలిగిస్తోంది. స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన జగన్ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల అడ్డాగా మారుతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: