ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే దారుణమైన ఓటమి ఒక వైపు గుండెల్లో గునపాలు గుచ్చేస్తూంటే రెండున్నర నెలలకే పరేషన్ అవుతున్నారు. తాను అన్నీ మంచి పనులే చేశానని, దేశంలో తనకంటే బాగా పాలించే నాయకుడే లేడని బాబు అంటున్నారు. ఇన్ని చేసినా తనకు ఇంత తక్కువ సీట్లు ఇస్తారా అంటూ మండిపోతున్నారు.


ఇక జగన్ మీద చంద్రబాబు ఏకంగా ఫైర్ అవుతున్నారు. అధికార మధంతో జగన్ ప్రవర్తిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అసెంబ్లీలో నన్నే నిలదీస్తారా అంటూ మండిపోతున్నారు. నా అనుభవం అంత వయసు లేదు జగన్ కి, నన్నే అవమానిస్తున్నారంటూ తెగ బాధపడిపోతున్నారు. గుంటూరు పార్టీ ఆఫీసులో ఈ రోజు చంద్రబాబు మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.జగన్ని వీధి రౌడీగా సంబోధించిన బాబు ఈయన కంటే వాళ్ళ నాన్నే నయం అన్నట్లుగా మాట్లాడారు.


వైఎస్సార్ సీఎం గా  ఉన్నపుడు నేను అపోజిషన్లో ఉన్నాను. నాకు వైఎస్సార్ గౌరవం ఇచ్చేవారు. ఓ విధంగా నేనంటే వైఎస్సార్ భయపడేవారు అంటూ బాబు అన్న మాటలు షాకింగే  సుమా. వైఎస్ ఎపుడు చంద్రబాబుకు భయపడ్డారో కానీ ఇపుడు ఆయన లేరు కాబట్టి చెప్పేసుకుంటున్నారా అనిపిస్తోంది.ఇక ఏపీలో తన అభివ్రుద్ధిని జగన్ ఓర్వలేకపోతున్నారని బాబు అంటున్నారు. కేవలం నా మీద కక్ష కట్టి నా పధకాలు, అభివ్రుధ్ధిని లేకుండా చేస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు. అన్న క్యాంటీన్లపై పసుపు రంగు తీసేసి తెల్ల  సున్నం వేయడమేంటని బాబు ప్రశ్నించారు.



తాను గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేశానని ఆయన చెప్పుకున్నారు. అటువంటిది ఇపుడు టీడీపీని లేకుండా చేస్తామంటే వూరుకుంటామా అని బాబు గద్దిస్తున్నారు.  జగన్ ఉత్త హామీలు ఇచ్చెసి అధికారంలోకి వచ్చాక, పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటూ సెటైర్లు వేశారు. ఏపీని ఏం చేద్దామనుకుంటున్నారో అర్ధం కావడంలేదని బాబు వాపోవడం చూస్తూంటే ఓటమి చంద్రబాబును ఎంతలా కలవరపెడుతోందో అర్ధమవుతోంది. ఓ వైపు అధికారంలో ఉంటూ జగన్ సీఎం గా బిజీగా ఉంటే దాన్ని టీవీల్లో చూస్తున్న బాబు అండ్ కో తట్టుకోలేకపోతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా బాబు షాకింగ్ స్టేట్మెంట్స్ ఆ పార్టీకి ఎంతవరకూ ఉపయోగమో ఆలోచించుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: