కేశినేని నాని ట్విట్ల రాజు. తెలుగు దేశం పార్టీ ఎంపీ అయినా ఆ పార్టీనే విమర్శిస్తుంటాడు నాని. అతని ట్వీట్లకు బ్రేక్ ఉండదు. అతను పెట్టె ట్విట్లు ఒక విధంగా చెప్పాలంటే వారి పార్టీ వాళ్ళను విమర్శించడం కోసమే అన్నట్టు ఉంటాయి. అలాంటి ట్విట్ స్టార్ కేశినేని నాని. గత నెలలో కేశినేని నాని పెట్టిన ట్విట్ వాళ్ళ పార్టీ నేతల కోసేమే అని అర్థమైంది కానీ వాళ్ళ పార్టీలో ఎవరి కోసం అనేది వాళ్ళు స్పందిస్తే తప్ప తెలీలేదు. 


నాలుగు పదాలు రానివాడు కూడా ట్విట్ చేస్తున్నాడు, ఇది మన దౌర్బాగ్యం అని నాని ట్విట్ చేస్తే నారా లోకేష్ గారి కోసం అని నెటిజన్లు అంత అనుకున్నారు. కానీ ఆ ట్విట్ నారా లోకేష్ కోసం కాదు నా కోసం అంటూ బుద్ధా వెంకన్న ట్విట్ చేసి ట్విట్ల యుద్ధం చేసుకున్నారు. ఒకే పార్టీ నాయకులూ అయినా ఒకరి తప్పులు ఒకరు చెప్పుకొని రోజంతా ట్విట్ల చేసుకున్న సంగతి తెలిసిందే. మరుసాటి రోజు ఉదయం బుద్ధా వెంకన్న 'అధిష్టానం కోసం నేను ఈ ట్విట్ల యుద్ధం ఆపేస్తున్నా' అంటూ ట్విట్ చేశారు వెంకన్న.   


బుద్ధా వెంకన్న ట్విట్ల యుద్ధం ఆపేస్తున్న అన్న కూడా 'కేశినేని నాని' మాత్రం నేను ఎవరి కోసం ఆపాను, కావాలంటే రాజీనామాకు సిద్ధం అని ట్విట్ చేశారు. ఆలా సంచలనం ట్విట్లు చేసి అధిష్టానానికి వణుకు పుట్టిస్తుంటాడు కేశినేని నాని. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని ఈరోజు ట్విట్ చేస్తూ 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు మీరు తీసుకున్న ఈ నిర్ణయంను నేను సమర్ధిస్తాను. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్ పిక్కో లేక యితర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అంటూ ట్విట్ చేశారు. 
ఈ ట్విట్ చూసినా నెటిజన్లు 'ఏంటి మాస్టారు త్వరలో వైసీపీలోకి జంపా' అని ట్విట్ చేస్తున్నారు. మరికొందరు అబ్బా సారు ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ పాలకపక్షానికి మద్దతు ఇస్తుందా.. అసలు మీకు బుర్ర ఉందా అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి కేశినేని పార్టీ మారనున్నారా ? లేక టీడీపీ లోనే ఉంటారా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: