బీజేపీ రాజకీయ నాయకులను తయారు చేసే కర్మాగారం. సిధ్ధాంత బధ్ధత కలిగిన పార్టీలు ఈ దేశంలో వామపక్షాలు, బీజేపీ మాత్రమే. తమ భావజాలాన్ని నిండా నింపేసిన లీడర్లను అవి తయారుచేసుకుంటాయి. బయట వారు ఆ పార్టీల్లో చేరినా వారు కూడా అలా మారిపోవాల్సిందే లేకపోతే ఎక్కువ రోజులు ఉండలేరు. ఇదిలా  ఉండగా మోడీ మొదటి ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్  లో చికిత్స పొందుతున్నారు.


బీజేపీలో ఇదొక షాకింగ్ లాంటి  న్యూస్. నిజానికి మోడీ గత క్యాబినెట్లో పనిచేసిన సీనియర్ సహచరులను ఎందరినో కోల్పోయింది. నిన్న కాక మొన్న సీనియర్ నేత సుష్మా స్వరాజ్ హఠాత్తుగా ఈ లోకం వీడివెళ్ళిపోయారు. ఆమె వయసు 67 ఏళ్ళు మాత్రమే. ఇక గోవా సీఎంగా ఉన్న ఒకప్పటి మోడీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఈ ఏడాదే కన్నుమూశారు. ఆయన వయసు కూడా 63 మాత్రమే. అదే విధంగా ఎన్నికలకు ముందు కర్నాటకకు చెందిన మోడీ అతి ముఖ్య సన్నిహితుడు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ హెగ్డే కూడా 59 ఏళ్ళ పిన్న వయసులోనే కన్నుమూశారు



. వీరంతా యోధానుయోధులు. తనకంటూ అటు బీజేపీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ బలమైన ముద్ర వేసుకున్న వారే కావడం విశేషం. ఇక మోడీకి అరుణ్ జైట్లీ కుడిభుజంలా ఉండేవారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఆయన గొంతు చాల బలమైనది. ప్రభుత్వంలోనూ మోడీ ఏరి కోరి ఆయన్ని ఆర్ధిక మంత్రిని చేస్తుకున్నారు. అటువంటి జైట్లీ చాలాకాలంగా అరోగ్యపరమైన  ఇబ్బందులు పడుతున్నారు.


అనారోగ్య  సమస్యలు ఆయన్ని పెద్దఎత్తున  చుట్టుముట్టాయి. అమెరికా కూడా ఆయన వైద్యం చేయించుకున్నారు. అయినా పరిస్థితి కుదుటపడలేదు. ఇపుడు హఠాత్తుగా  ఆయన ఐసీయూలో ఉండడం అందరినీ కలచివేస్తోంది. . బీజేపీ ఓ వైపు అనితర సాధ్యమైన విజయాలతో దూసుకెళ్తూంటే  మరో వైపు ఈ విషాదాలు ఏంటన్ని పార్టీ కలవరపడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: