మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా చంద్రబాబునాయుడులో మార్పేమీ రాలేదు. అధికారంలో ఉన్నంత కాలం అన్నీ వర్గాలకు తప్పుడు హామీలతో మభ్యపెట్టి ఫలితాన్ని అనుభవించారు. అయినా చంద్రబాబు వైఖరిలో మార్పేలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అదే పద్దతిని కంటిన్యు అదే పద్దతిలో పోతున్నారు. తాజాగా గిరిజనులతో మాట్లాడుతూ గిరిజనులకు ఎంఎల్ఏ, ఎంఎల్సీ పదవులిస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లోనే కాదు అంతకు ముందు ఎన్నికల్లో కూడా టిడిపి తరపున ఒక్క గిరిజన ఎంఎల్ఏ, ఎంపి కూడా గెలవలేదు. అందుకనే వైసిపి తరపున గెలిచిన గిరిజన ఎంఎల్ఏలు, ఎంపిని ప్రలోభాలకు గురిచేసి లాక్కున్నారు. ఫిరాయింపుల దెబ్బకే మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు.

 

చంద్రబాబు తాజా హామీ విషయం ఆలోచిస్తే లాజికల్ గా మరో ఐదేళ్ళ వరకూ ఎంఎల్ఏ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కాబట్టి టిడిపి తరపున గిరిజనులను చంద్రబాబు ఏ విధంగా ఎంఎల్ఏలను చేస్తారు ? ఇక ఎంఎల్సీ పదవుల విషయం చూసినా అదే పద్దతి. సమీప భవిష్యత్తులో అంటే మరో ఐదేళ్ళ వరకూ శాసనమండలిలో ఖాళీ అయ్యే ఏ విధమైన ఎంఎల్సీ పదవిని కూడా చంద్రబాబు గిరిజనులతో భర్తీ చేయలేరు.

 

ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాలంటే ఉన్నదే 23 మంది ఎంఎల్ఏలు కాబట్టి సాధ్యం కాదు. గవర్నర్ కోటాలో భర్తీ చేద్దామన్నా అధికారపార్టీకి మాత్రమే అవకాశాలుంటాయి. ఇక స్ధానిక సంస్ధలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎంఎల్సీలను భర్తీ చేద్దామని అనుకున్నా కూడా చంద్రబాబుకు సాధ్యంకాదు.

 

వాస్తవాలు ఈ విధంగా ఉంటే గిరిజనులకు ఎంఎల్ఏ, ఎంఎల్సీ పదవులు ఇస్తామని చంద్రబాబు నిసిగ్గుగా చెబుతున్నారంటే అబద్ధాలు చెప్పటం తప్ప మరోటి కాదు. తాను చెప్పే అబద్దాలు ఎల్లకాలం ఫలితాలను ఇవ్వదని, జనాలు నమ్మరని తెలిసి కూడా చంద్రబాబు తన పద్దతి మార్చుకోవటం లేదంటే అబద్ధాలు చెప్పటానికి అలవాటు పడిపోయారని అర్ధమవుతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: