శ్రీశైలం ప్రాజెక్ట్ ఇటు ఆంధ్ర ప్రదేశ్ కు అటు తెలంగాణకు జీవనాధారం. ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు రాష్ట్రాల రైతులు లక్షల ఎకరాలను సాగు చేసుకునే సౌలభ్యం కల్పిస్తుంది. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, తరువాతి కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. తరువాతి కాలంలో ఈ పేరును నీలం సంజీవ రెడ్డి సాగర్ గా అప్పటి ముఖ్య మంత్రి పేరు మీద గా నామకరణం చేయబడింది. 2009 అక్టోబరు 2 న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీశైలం యెక్క నాలుగు గేట్లు నిన్న ఎత్తివేయడానికి .. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలవనరుల అధికారాలు నీటి మట్టాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు . 


రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి సుమారు 4 లక్షల పైగా క్యూసెక్కుల నీటి వరద వచ్చి చేరింది. అధికారులు ముందు జాగ్రత్తగా నిన్న నాలుగు గేట్లు ఎత్తివేసి, సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి అధికారులు ప్రయత్నించారు . నిన్న సాయంత్రం మంత్రి సమక్షంలో 4 గేట్లు ను జల వనరు అధికారాలు ఎత్తినారు . సాధారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి 15 లక్షల క్యూసెక్కుల నీరు వస్తేనే దానిని వరదగా భావిస్తారు. 


అయితే ఇప్పుడు వచ్చిన సమస్యేమీ లేదని .. ఇప్పడు కేవలం నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రాజెక్టులో చేరిందని, ఈ రోజు సాయంత్రం సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని .. ప్రతి గంటకు పరిస్థితిని గమనించి గేట్లను పెంచడం లేదా తగ్గించడం చేస్తామని జల వనరుల అధికారులు నిన్న చెప్పుకొచ్చారు. అయితే వరద ఉదృత తీవ్రంగా ఉండటంతో ప్రాజెక్ట్ లో 4 లక్షలు క్యూసెక్కుల కంటే ఇంకా దాటిపోవడంతో ఏకంగా 10 గేట్లు ఎత్తివేయడానికి ఈ రోజు అధికారులు సిద్ధమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: