ఆక్సాయిచిన్ ఇది కూడా కాశ్మీర్ లో అంతర్భాగమేనని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఎలాగైతే మనది అని చెప్పుకుని తిరుగుతున్నామో ఆక్సాయిచిన్ కూడా మనదే అని భారత్ వాదిస్తుంది. అవును నిజమే ఆక్సాయిచిన్ కూడా భారత్ లోనే  అంతర్భాగమే అందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. పార్లమెంట్ లో అమిత్ షా కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎలాగైతే ఇండియాలో భాగమో .. ఆక్సాయిచిన్ కూడా ఇండియాలోనే భాగమని, దానిని కూడా తిరిగి సాధిస్తామని అమిత్ షా పార్లమెంట్ లో చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే ఆక్సాయిచిన్ ను తిరిగి సాధించడం సాధ్యమేనా ? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. 


పాక్  భారత్ 1947 లో విడిపోయినప్పుడు రెండు దేశాలు విభజన క్రమంలో బిజీగా ఉన్నప్పుడు చైనా తెలివిగా ఆక్సాయిచిన్ ను ఆక్రమించడం ప్రారంభించింది. అప్పుడు ఆ విషయంలో పటేల్ హెచ్చరించిన నెహ్రు పట్టించుకోకుండా ముందు మనది మనం చూసుకున్నాము. తరువాత దాని సంగతీ అని చెప్పడంతో .. చైనా ఆక్సాయిచిన్ మీదుగా 1200 కిలో మీటర్లు మేర రోడ్డును వేయడం స్టార్ చేసింది. 1947 లో స్టార్ట్ చేస్తే 1950 లో అయిపోయింది. 


అయితే చైనా ఎప్పుడైతే 1957 లో తన మ్యాప్ లో ఆక్సాయిచిన్ ను చూపించడం ప్రారంభించిందో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో భారత్  చైనా మధ్య యుద్ధం అనివార్యం అయ్యింది. ఆ యుద్ధంలో భారత్ ఓడిపోవటం .. ఒప్పందం కుదుర్చుకోవటంతో ఆక్సాయిచిన్ భారత్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇండియా తిరిగి దానిని సాధించాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఫుల్ స్కేల్ యుద్ధం వస్తే, పరిస్థితి మరోలా ఉంటుంది. రెండు దేశాలకు తీవ్ర నష్టమని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: