భారత్ ఎప్పుడైతే కాశ్మీర్ కు ఉన్న ఆర్టికల్ 370 అండ్ 35 A రద్దు చేసిందో పాకిస్థాన్ నానా హంగామా చేస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రపంచ దేశాలను జోక్యం చేసుకోవాలని కోరినప్పటికీ అన్ని దేశాలు సారీ అని చెప్పిన పరిస్థితి. ఈ విషయంలో ఐక్యరాజ సమితి కూడా మేము ఈ విషయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పాయి. దీనితో పాకిస్థాన్ ను ప్రపంచ దేశాలు పట్టించుకునే పరిస్థితిలో ఒకటి కూడా లేవు. ఇప్పటికే అమెరికా .. పాక్ కు వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని ఉగ్రవాద దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోమని చెప్పింది. అన్నీ దేశాలు ఇది భారత్ అంతర్గత వ్యవహారంగానే చూస్తున్నాయి .. తప్పితే ఇదొక దురాక్రమణ చర్యగా ఏ దేశం కూడా చూడక పోవటంతో పాక్ కు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. చాలా దేశాలు కూడా భారత్ తో యుద్ధం వద్దని కూడా పాక్ కు చెప్పాయి. యుద్ధం చేస్తే పాక్ ఓడిపోతుందని ఆ దేశాలకు కూడా తెలుసు కాబట్టి. 


ఇప్పుడు ఏ దేశం కూడా పాకిస్థాన్ మాటలు విని ఇప్పుడు భారత్ ను ప్రశ్నించే సాహసం చేయదు. ఇప్పటికే అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఒంటరిగా తయారైంది. ఆర్ధికంగా చితికిపోయిన దేశం. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా ముద్ర పడిన దేశం పాకిస్తాన్. అలాంటి దేశం కోసం ఏ దేశం కూడా ఇండియాతో సున్నం పూసుకోవాలని అనుకోదు. పైగా ఇప్పుడు ఇండియా అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలను అందుకున్నది.


ఇటు ఆర్ధికంగా కావొచ్చు, దేశంలో నిపుణుల పరంగా కావొచ్చు. భారత్ ఎన్నో విషయాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించింది. అయితే పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడే దేశం ఒక్క చైనా మాత్రమే .. ఇప్పుడు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతుంది. భారత్ కు నీతి వాక్యాలు వల్లిస్తుంది. దీనితో ఇండియా కూడా వెంటనే స్పందించింది. మా దేశ విషయాల గురించి మాట్లాడవద్దు. మేము మీ దేశ విషయంలో జోక్యం చేసుకోలేదు కదా అంటూ ఘాటుగా చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: