భారత్ కు దాయాది దేశం పాక్ కు మధ్య ఎప్పుడు మండుతున్న చిచ్చుగా   ఉన్న కాశ్మీర్ విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దానితో కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ని మరియు రాష్ట్రం హోదాను కోల్పోవాల్సి వచ్చింది. అధికరణ 370 రద్దుతో కాశ్మీర్ సమస్య దాదుపుగా ఓ కొలిక్కి వచ్చేస్తుంది అనే భయం పట్టుకున్న పాక్ ఆ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళి అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిరూపించాలని చూసింది కానీ ప్రపంచమంతా భారత్ కు అండగా నిలవడంతో దాయాది దేశానికి షాక్ తగిలింది. అగ్రదేశమైన అమెరికా ఒక అడుగు ముందుకేసి పాక్ ఎలాంటి చొరబాట్లులకు పాల్పడవద్దని వార్నింగ్ ఇచ్చింది.

దానితో భారత్ ను ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా పాక్ రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాన్ని వీలయినంత తగ్గించాలని, దౌత్య సేవలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయాన్ని తీసుకుంది. అసలే ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న పాక్ పై ఈ నిర్ణయంతో మరింత భారం పడనున్నది. ఇప్పటికే అక్కడ బెలూచిస్తాన్ కావాలని వేర్పాటువాదుల చేస్తున్న ఉద్యమం పై పాక్ వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో ప్రపంచదేశాలలో పాక్ ప్రతిష్ట మంటగలిసింది. దానిని సరి చేసుకునే పనిలో పడిన పాక్ కు ఇప్పుడు అక్కడి ఒక ప్రాంతం వారు షాక్ ఇచ్చారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలు ఇప్పుడు రోడ్ల పైకి వచ్చి తమకు పాక్ నుండి విముక్తి కావాలని కోరుతూ ఉద్యమం చేస్తున్నారు. దాని పై పాక్ ప్రభుత్వం ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది.ఇది భారత్ తీసుకున్న నిర్ణయం వల్లే అని పాక్ ప్రభుత్వం భావిస్తుంది.పాక్ కంటే భారత్ ఎంతో మేలు అని అక్కడి వేర్పాటువాదులు అంటున్నారు.ఇప్పుడు భారత్ కాశ్మీర్ ను అభివృద్ది పదంలో నడిపితే పివోకే లోని ప్రజలు మనతో కలవాలని కోరతారు అని విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: