కళ కు  దూరమవుతున్న  తపస్వి

ఆయన సినిమా ఒక కళాఖండం,  ఆయన సినిమా ఒక ఆణిముత్యం,  ఆయన సినిమా ఒక అద్భుతం. ఆబాలగోపాలాన్ని  ఈ సినిమా ద్వారా అలరించడం ఆయనకే చెల్లింది.   ఆయన మరెవరో కాదు కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు.

 శ్రీ కె విశ్వనాథ్ గారు ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం,  తెలుగు సినిమా చరిత్రలో ఎంత ప్రభంజనం మనందరికీ తెలుసు. సిరి సిరి మువ్వ సప్తపది స్వాతిముత్యం ఇలా ప్రతి చలనచిత్రం దేనికదే సాటి అన్నట్లు ఉండడం  అతిశయోక్తి కాదు.

శ్రీ కె విశ్వనాథ్ గారు  తాను ఇకపై సినిమాకు దర్శకత్వం చేయటం  మానేస్తున్న ట్లు తెలియజేశారు. ఇకపై తాను సినిమా  తీయనని స్పష్టం చేశారు. తనకెంతో ఇష్టమైన సినిమా రంగం నుంచి తప్పుకోవడం కొంచెం  బాధగానే ఉందన్నారు. రాను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు.   తనకు ఏ విధమైన అనారోగ్యం లేదని, అలాగే ఏ విధమైన అనారోగ్య సమస్యలతో బాధ పడటం లేదని చెప్పారు.

 ఈరోజు ఒక అనుకోనిఅతిధి తన ఇంటికి వచ్చినట్లు తెలియజేశారు.   ఆయనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు గారు.   తన సినిమా నచ్చి, శ్రీ కెసిఆర్ గారు తనతో మాట్లాడారని ఈ సందర్భంగా  తన ను కలవాలనుకున్నారని చెప్పారు. అన్నట్లుగానే ఈరోజు మధ్యాహ్నం తమ ఇంటికి వచ్చినట్లు  శ్రీ విశ్వనాధ్ గారు తెలియజేశారు.

 శ్రీ కె విశ్వనాథ్ గారు  చివరగా శుభప్రదం అనే సినిమాకు దర్శకత్వం వహించారు.   గత కొంతకాలంగా ఆయన సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: