నరేంద్ర మోడీ .. నిజంగానే పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లి ట్రంప్ తో మాట్లాడి కాశ్మీర్ విషయాన్ని రెచ్చగొట్టానని చాలా అనందం పడ్డారు. ట్రంప్ కూడా నేను మధ్య వర్తిత్వం చేస్తానని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ చాలా సంతోష పడ్డారు. ఎప్పటికైనా కాశ్మీర్ ను తాము దక్కించుకుంటామని పాకిస్థాన్ అనుకుంటూ వచ్చింది. అయితే నరేంద్ర మోడీ ఇమ్రాన్ ఎత్తులకు పై ఎత్తు వేసి అస్సలు కాశ్మీర్ కు ఉన్న అధికారాలను తొలిగించి ఏకంగా భారత్ లో కలిపేశారు. దీనితో ఇమ్రాన్ కు మాస్టర్ స్ట్రోక్ తగిలింది. ఇన్ని రోజులు కాశ్మీర్ .. కాశ్మీర్ అని అరిచి గోల చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అది భారత్ లో పూర్తిగా అంతర్భాగం అయిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. 


ఇప్పటికే పాకిస్థాన్ ప్రపంచ దేశాలను జోక్యం చేసుకోవాలని కోరినప్పటికీ అన్ని దేశాలు సారీ అని చెప్పిన పరిస్థితి. ఈ విషయంలో ఐక్యరాజ సమితి కూడా మేము ఈ విషయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పాయి. దీనితో పాకిస్థాన్ ను ప్రపంచ దేశాలు పట్టించుకునే పరిస్థితిలో ఒకటి కూడా లేవు. ఇప్పటికే అమెరికా .. పాక్ కు వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని ఉగ్రవాద దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోమని చెప్పింది.


అన్నీ దేశాలు ఇది భారత్ అంతర్గత వ్యవహారంగానే చూస్తున్నాయి .. తప్పితే ఇదొక దురాక్రమణ చర్యగా ఏ దేశం కూడా చూడక పోవటంతో పాక్ కు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. చాలా దేశాలు కూడా భారత్ తో యుద్ధం వద్దని కూడా పాక్ కు చెప్పాయి. యుద్ధం చేస్తే పాక్ ఓడిపోతుందని ఆ దేశాలకు కూడా తెలుసు కాబట్టి. ఇక ఇజ్రాయిల్ కూడా ఏకంగా ఒక అడుగు ముందుకేసి పీవోకే లో దాడులు చేస్తే చెప్పండి మేము కూడా వస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: