2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ ఘన విజయంతో ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు సమర్ధవంతమైన పాలన అందించే దిశగా పలు రకాల ప్రజాకర్షక పథకాలతో ముందుకు సాగుతున్నారు. ఓవైపు పోలవరం, యువతకు ఉద్యోగాల కల్పన, మధ్య నిషేధం ఇలా ఒక్కొక్కటిగా పలు అంశాలపై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్న మా యువ ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబందించిన మిగిలిన అంశాలపై కూడా గట్టిగా దృష్టి సారించేలా ముందుకు పోతున్నారని అంటున్నాయి వైసిపి శ్రేణులు. 

ఇక రాష్ట్రానికి అవసమైన నిధులపై ప్రస్తుతం దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి గారు, రాబోయే అతి కొద్దిరోజుల్లోనే రాజధాని అమరావతి విషయమై కూడా దృష్టి సారించడం జరుగుతుందని వారు చెప్తున్నారు. ఇటీవల ప్రతిపక్షాలు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ గారు అమరావతి అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని, ఆయనకు తన శాఖల్లోని మంత్రులు, ఎమ్యెల్యేల అభివృద్ధి పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదంటూ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కొందరు వైసిపి నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబందించి ప్రతి ఒక్క అంశంపై ఏ విధంగా ముందుకు సాగాలి అనేవి పక్కాగా సిద్ధం చేసి ఉంచారని, అలానే నూతన రాజధాని అభివృద్ధి, 

అక్కడి ప్రస్తుత పరిస్థితి, రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపడితే అక్కడ అభివృద్ధి మరింతగా వేగంగా సాగుతుంది తదితర అన్ని అంశాలు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయడం జరిగిందని అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కి కేవలం మూడు నెలలే గడిచిందని, అయినప్పటికీ ఇప్పటికే మేము మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం, ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివౄద్ధి బాటన నడిపి, ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో తమ జీవనాన్ని గడపాలి అనేది మా అందరి లక్ష్యం అని వారు అంటున్నారు. అయితే ఈ విషయమై రాద్దాం చేస్తున్న ప్రతిపక్షాలు, రాబోయే రోజుల్లో తన అద్భుతమైన ప్రణాళికతో జగన్ గారు, రాజధాని అమరావతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి, ఇప్పుడు నిందలేస్తున్న వారి నోటికి తాళాలు వేసితీరుతారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాలి....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: