వైఎస్‌ఆర్‌సిపి నాయకుల దుస్స చర్యలు మరియు అవకతవకలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్న లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు.


వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో చెరువును ఆక్రమించుకున్న దుశ్చర్య పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ. ఈ సమస్య చిన్న సమస్య కాదు అని దీనిని పరిష్కరించి ప్రజల సమస్యలను తీర్చాలని అయన ఈ మేరకు ముఖ్య మంత్రి వైయస్ జగన్ కు ఓ లేఖ రాశారు.


కన్నా  తన లేఖలో గ్రామం ప్రజలు అందరు కలిసి గ్రామంలోని ఇరవై నాలుగు ఎకరాల చెరువును బాగుచేయాలి అని తలచి అక్కడి ప్రజలంతా కలిసి ఇరవై ఐదు లక్షలు కలెక్ట్ చేసి ఆ చెరువును బాగుచేసుకున్నారని అయన తెలిపారు.


అయన తన లేఖ లో వివరంగా జరిగింది చెప్తూ " వైస్సార్సీపీకి చెందిన లోకల్ లీడర్స్ సిరిపురపు విజయ భాస్కర్ రెడ్డి సూరం రమణ అనే వ్యక్తులు ఆ గ్రామంలో బాగుచేయబడిన చెరువు ఫెన్సింగ్ ను తొలగించి ఇరవై ఐదు అడుగుల మేర ప్రైవేట్ వాటర్ ప్లాంట్  కోసం నిర్మాణం పనులు ప్రారంభించారని" కన్నా స్పష్టంగా రాసి తెలియజేసారు.


కన్నా  తన లేఖతో పాటు భావన నిర్మాణాలకు సంబదించిన సాక్షాదారాలను ఫొటోల రూపంలో జతచేసి ముఖ్యమంత్రి గారికి ఓ లేఖ రాసారు. అది కంప్లీట్ గా  ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ కోసమే అక్కడ అక్రమ నిర్మాణం జరుగుతోందన్నారు.


అయిన ముఖ్యమంత్రి గారిని వెంటనే చొరవ తీసుకొని అక్కడ జరుగుతున్నా అక్రమ నిర్మాణాలన్ని ఆపి ప్రజల ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేశారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.


మరింత సమాచారం తెలుసుకోండి: