తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా మన ఆంధ్రా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరియు ఇతర అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి రాజధాని నిర్మాణం లేకపోవడం మరియు పోలవరం పై  ఇప్పటికి ఒక స్పష్టత లేకపోవడంతో పభుత్వ వైఫల్యం మనకు తెలుస్తోంది. ఇటు చూస్తే హైదరాబాద్ జనాభా రోజు రోజుకు రెట్టింపవుతోంది. ఆర్ధికాభివృద్ధి అంచనాలకు అందని విధంగా ఉండబోతోంది. హైదరాబాద్ మాత్రమే కాదు దేశంలోని మెట్రో సిటీలన్నీ అదే వృద్ధిలో  ఉండబోతున్నాయి. మరి అమరావతి పరిస్థితేమిటి అది పునాదుల దశలోనే ఆగిపోతుందా అని ప్రశలు తలెత్తుతున్నాయి.నవ్యాంధ్రకు ప్రజా రాజధాని కలగానే మిగిలిపోతోందా అమరావతిని ఆపేయడం పొరుగున ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి తావునిస్తోందా అని అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. భవిష్యత్ లో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో అమరావతి పెద్ద సిటీ అవుతుందని పరిశ్రమలన్నీ అక్కడికే వెళ్తాయని  కొన్నాళ్ల క్రితం ఓ తమిళనాడు మంత్రి వ్యాఖ్యలు చేశారు.


తమిళ మంత్రి ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో పరిస్థితి అలాగే ఉంది శూన్యం నుంచి ప్రారంభమైన అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు శరవేగంగా క్లాసులు ప్రారంభించాయి. పెద్ద పెద్ద సంస్థలు తమ క్యాంపస్ లు ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యాయి. అదే సమయంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన వేగంగా జోరందుకుంటోంది. హెచ్ సీఎల్ లాంటి కంపెనీ లు కూడా ఆశక్త చూపించాయి. ఒక్కసారి బలమైన పునాది పడితే ఎంత వేగంగా అభివృద్ధి చెందవచ్చు అనేది హైదరాబాద్ లో హైటెక్ సిటీ చూపించింది. అందుకే అప్పటి నేతలకూ అలాంటి అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎవరూ అమరావతి గురించి మాట్లాడే సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవటం లేదు. మూడు నెలల కాలంలోనే అమరావతి రేస్ లో నుంచి వైదొలిగింది. దాన్ని ఓ శిథిల నగరంగా కూడా గుర్తించటానికి ఇతర రాష్ట్రాల వారు సిద్ధపడటం లేదు. కానీ అమరావతి అలా అర్ధాంతరంగా ఉండిపోవడం నగరాలు వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో పొరుగు రాష్ట్రాలకు వరంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి జెట్ వేగంతో పెరగడానికి ఓ కారణంగా మారింది. గత నాలుగైదేళ్ల కాలంలో హైదరాబాద్ తో పోటీగా రియల్ ఎస్టేట్ అమరావతిలో జోరు మీదుంది.


ఇప్పుడు అమరావతిలో స్లంప్ ఏర్పడింది ధరలు నలభై శాతం పడిపోయాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం రాష్ట్ర విభజన తర్వాత అటు పెరగకుండా ఇటు తగ్గకుండా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు గత నష్టాలని కవర్ చేసుకుంటూ పుంజు కొచ్చింది.హైదరాబాద్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ధరలు కూడా మూడు నెలల కాలంలో ముప్పై శాతానికి పైగా పెరిగాయి. కొత్త రాజధాని  ప్రపంచ స్థాయి నగరమని పెట్టుబడులకు అమరావతి వైపు మొగ్గు చూసిన వారంతా మనసు మార్చుకున్నారు. వారి చూపు మళ్లీ హైదరాబాద్ పై పడింది. ఈ ట్రెండ్ ఎలా ఉందంటే పదేళ్లలో హైదరాబాద్ జనాభా రెండు కోట్లకు చేరుతుందని అంచనాలకు ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం మెట్రో నగరాలకు వలసలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అవకాశాలనూ అందిపుచ్చుకునేందుకు నగరాలనూ విస్తరించుకునేందుకు ప్రభుత్వా  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ అమరావతి విషయంలో ఏపీ సర్కారు వైఖరి మాత్రం భిన్నంగా ఉంది. సహజంగా అమరావతి అభివృద్ధి చెందితే ఆ ఒత్తిడి ప్రధానంగా పడేది హైదరాబాద్ మీదే.


హైదరాబాద్ మహా నగరంలో దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్లు ఉన్నప్పటికీ వారిలో సీమాంధ్రులు వాళ్ళు ఎక్కువ. కారణం ఏదైనా కావచ్చు కానీ వారు తమ రాష్ట్రంలో ఉద్యోగ వ్యాపారాల చేసుకుంటే బెటర్ అనే భావనలకు గత నాలుగైదేళ్ల కాలంలో వచ్చారు. కానీ ఇప్పుడు వారు మనసు మార్చు కున్నారు, ఏదయినా హైదరాబాద్ లోనే అన్నట్లు గా తమ విధానాన్ని మార్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవరినీ నిర్లక్ష్యం చెయ్యటం లేదు ఉద్యమ కాలం నాటి ఇమేజ్ ను పూర్తిగా తుడిచి పెట్టేసింది. ఈ కారణంగా భరోసా కూడా ఎక్కువ గానే ఉంది. ఓ రకంగా ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే ఎవరో ఒకరు పర్సంటేజ్ కోసం వస్తారు. హైదరాబాద్ లో అలాంటి దిగులు లేదని  వర్గాలు వెల్లడవుతున్నయి. ప్రభుత్వ విధానాల పాలనా తీరు అమరావతిని వెనక్కి నెట్టేసింది. మెట్రో నగరాల కు ఉన్న ప్లస్ పాయింట్ లను అందుకోలేక చతికలపడిపోయింది.


అమరావతి ఫుల్ స్వింగ్ లో కొత్త పరిశ్రమ లు రావేమోననే బెంగ పడిన వారికి ఇప్పుడు నిశ్చింత చేకూరింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు స్థిరత్వం వచ్చింది. ఇతర మెట్రో నగరాలకు ఏపీ యువత వలసలు పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమరావతి పరిస్థితి ఇలా మారడం వల్లే హైదరాబాద్ కు ఇంతటి గుర్తింపు వచ్చిందా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అమరావతి పనులను అర్ధాంతరంగా నిలిపి వేయడంతో ఏపీ ఎంత మేర నష్టపోతుంది అని భవిష్యత్ లో మెట్రో సిటీలు ఎలా అభివృద్ధి చెందుతాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: