బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కెపాసిటి ఏంటో తేలిపోయే సమయం వస్తోంది. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని తాజాగా కన్నా ప్రకటించారు. నిజానికి బిజెపికి ఏపిలో అంత సీన్ లేదనే చెప్పవచ్చు. కాకపోతే తమ కెపాసిటిని కమలనాధులు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు.

 

బిజెపి రాష్ట్ర నేతలతో సమస్య ఎక్కడ వస్తోందంటే ఎక్కడో కేంద్రంలోనో లేకపోతే ఉత్తరాధి రాష్ట్రాల్లో బిజెపి బలంగా ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బలోపేతమైపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు 0.84 శాతం. అంటే అసెంబ్లీ  కావచ్చు లేదా పార్లమెంటు సీటులో కావచ్చు చాలా చోట్ల అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రాలేదన్న విషయాన్ని కమలనాధులు మరచిపోతున్నారు.

 

ఏపిలో మొదటి నుండి బిజెపి పరిస్ధితి ఇలాగే ఉంది. ఇక్కడ కన్నా తెలంగాణాలో కాస్త నయమన్నట్లుగా ఉంది పార్టీ పరిస్ధితి. ఈ విషయం అందరికీ తెలిసినా బిజెపి నేతలు మాత్రం తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు. అయితే జాతీయ నాయకత్వానికి మాత్రం రాష్ట్రంలో పార్టీ బలంపై స్పష్టమైన అవగాహన ఉన్నట్లే ఉంది. అందుకనే ఇతర పార్టీల్లో బలమైన నేతలకు గాలమేసి బిజెపిలోకి లాక్కోవాలని గట్టిగా డిసైడ్ అయ్యింది.

 

పోనీ ఆ మేరకు ఏమన్నా సత్ఫలితాలు వస్తోందా అంటే అదీ లేదు. తమ పార్టీ బలోపేతం అవ్వటానికి బిజెపి తెలుగుదేశంపార్టీనే టార్గెట్ గా చేసుకుంది. అందుకనే వీలైనంతమంది నేతలను తమ పార్టీలోకి లాక్కోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఆ ప్రయత్నంలో కొంత వరకూ సఫలమైంది కాని పెద్దగా ప్రయోజనం కనబడలేదు.

 

నలుగురు రాజ్యసభ ఎంపిలను లాక్కునుంది కానీ వాళ్ళెవరూ జనబలం ఉన్న వాళ్ళు కాదు. అలాగే టిడిపిలో నుండి బిజెపిలోకి వెళ్ళిన కొందరు నేతలు కూడా పెద్దగా ప్రముఖులేమీ కాదనే చెప్పాలి. ఇటువంటి వారిని నమ్ముకుని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఒంటరిపోటికి రెడీ అవుతోందంటే కన్నా సామర్ధ్యానికి అగ్నిపరీక్షనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: