తూర్పు గోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్టు చేయడానికి పోలీసులు నిన్నంతా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈరోజు అర్రెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాపాకపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మలికిపురం ఎస్సై రామారావు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెండు రోజుల క్రితం రాపాక అనుచరులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ పై దాడి, ఆస్తుల ధ్వంసం అధికారుల విధులకు ఆటంకం కల్పించారని నేరంపై ఎమ్మెల్యే తో సహా పలువురు జనసేన కార్యకర్తలపై పిడి పిపి యాక్టు కింద కేసులు నమోదయ్యాయి.


ఇదిలా ఉంటే కేసుల గురించి తెలిసిన ఎమ్మెల్యే పోలీసులకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఆయన అరెస్టు కోసం రాత్రంతా హైడ్రామా నడిచింది. చింతలమోరిలోని ఆయన నివాసానికి వెళ్లగా ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవటంతో పోలీసులు వెనుదిరిగారు. బాధ్యత గల ఎమ్మేల్యే ఇలా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించటం సమాజానికి మంచిది కాదు అంటున్నారు డీఐజీ. జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పై నమోదైన నాన్ బెయిలెబుల్ కేసుపై స్పందించారాయన. 



అందరి బాధ్యతలు చెప్పుకునే, అందరి బాధను చెప్పుకునే పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేయడం నేరమని చెప్పారు. ఎస్సై తప్పు చేస్తే ఆధారాలతో ఉన్నతాధికారుల దృష్టికి తెస్తే చర్యలు తీసుకునేవాళ్లమని ఎమ్మెల్యేనే ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు డీఐజీ. దీనిపై స్పందించిన డీఐజీ మీడియాతో మాట్లాడుతూ, "రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, మలికిపురం ఎస్సై గారిని పోలీస్ స్టేషన్ ద్వారం దగ్గర నిలబడి కొంత మంది అనుచరులతోటి ఎస్సై మీద కొన్ని అభియోగాలు చేస్తూ,  



ఆ ఎస్సై కాలుస్తానని చెప్పినట్లు, ఆ ఎస్సై లంచగొండి అని, ఆయన పేకాటాడుతూ ఉంటే అక్కడికి పోయినట్టు రెండు కిడ్నీలు చెడిపోయిన ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి వాళ్ళని కేసు నుంచి తీయమని చెప్పినట్టు, సెల్ ఫోన్స్ వెహికిల్స్ వదలమని చెప్పినట్లు, దానికి ఎస్సై విననట్లు, అక్కడి నుంచి ఆ ప్రదేశం వదలి పోయినట్టు, ఆ తరువాత ఆయన ఆ రివాల్వర్ తోటి కాల్చేస్తాను అని చెప్పినట్టు, ఆ విషయాన్ని అడగటానికి అని పోలీసు స్టేషన్ కు వచ్చినట్లు, పోలీస్టేషన్ లో నిలబడి ఆయన ఎస్సైని పోకిరి నా కొడుకు మరియు తాగుడు అలవాట్లు ఉన్నట్టు తన అనుచరుల తోటి మాట్లాడుతూ సోషల్ మీడియాలో కనబడ్డారు" అని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: