ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి అడుగు పెట్టినప్పటి నుండి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ కేవలం రెండు నెలల్లో మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 


టీడీపీ నేతలు, అధినేతలు ఎన్ని విమర్శలు చేసిన తన పని తాను చేస్తూ ప్రతిక్షణం ప్రజల కోసం కేటాయిస్తున్నాడు వైఎస్ జగన్. పుట్టిన పాపా నుంచి వయో వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే పథకాలను అమలు చేసి ప్రజల మొఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాడు మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 


ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తినుకున్నారు. పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి ట్విట్ చేస్తూ ' పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. కొత్తగా 3 మెడికల్‌ కాలేజీలు, పేదరోగులకు అండగా ఉండేందుకు 5 క్యాన్సర్, 2 కిడ్నీ ఆస్పత్రుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాం. ప్రాధాన్యతల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులను, 108 & 104 సర్వీసులను మెరుగుపరుస్తున్నాం.' అని ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: