రేపటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరు విద్యార్థుల్లో సంతోషంగా జండావందనం చేయాల్సిన ముగ్గురు విద్యార్థులు కరెంట్ షాక్ రూపంలో లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  తమాగులూరు మండలం కోప్పర గ్రామంలో విద్యుత్ షాక్‌తో ముగ్గురు బాలురు మృతి చెందారు. ఈ ఉదయం వైసీపీ జెండా స్తంభం వద్ద విద్యార్థులు ఆడుకుంటున్నారు.

అదే సమయానికి జెండా స్థంబానికి పక్కనే ఉన్న విద్యుత్ లైన్ తగలడంతో ఆ స్తంబానికి షాక్ వచ్చింది..దాంతో స్తంబం వద్ద ఉన్న విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు షేక్ పఠాన్ గౌస్(11), షేక్ హసన్ బుడే(11), పఠాన్ అమర్ (11)గా గుర్తించారు.  పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపిలో ప్రస్తుతం వర్షాలు బాగా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంబాల వద్ద ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు తెలుపుతూనే ఉన్నారు.  బ్యానర్లు కానీ కరెంట్ స్థంబాల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద కానీ నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేయరాదని అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు.  కానీ కొంత మంది మాత్రం ఇప్పటికీ కరెంట్ తీగల వద్ద ప్రమాదం అని తెలిసినా ఆడుకోవడం..ఇతరత్రా పనులు చేయడం చేస్తూనే ఉన్నారు. 

అంతే కాదు కరెంటు స్థంబాల వద్ద ఆనుకుని ఉన్న చెట్లను కూడా మున్సిపాలిటీ శాఖ వెంటనే తొలగించే ప్రయత్నాలు చేస్తుంది.  ఒకవేళ కరెంట్ వైర్లు ఏమైనా తెగిపడినా వెంటనే విద్యుత్ శాఖాధికారులకు ఫోన్ చేసి అలర్ట్ చేయాల్సిందిగా వారు కోరుతున్నారు. తెల్లవారు జామున అందరు పిల్లలతో సంతోషంగా జెండావందనం చేయాల్సిన విద్యార్థులు ఈరోజు విగతజీవులుగా పడి ఉండటం అందరినీ కలచి వేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: