కేంద్రం .. కాశ్మీర్ కు ఉన్న ఆర్టికల్ 370 ను రద్ధు చేసి పెట్టుబడులను ఆకర్శించాలని భావించిన సంగతీ తెలిసిందే. ఎప్పుడు కాల్పులతో, మారణ హోమంతో అల్లాడిపోయే కాశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణం రావాలంటే .. అక్కడ పెట్టుబడులను రప్పించి కాశ్మీర్ ను దేశ అంతర్భాగంలో మమేకం చేయడమే మార్గమని కేంద్రం భావించింది. కాశ్మీర్ లో ఉన్న మౌలిక సదుపాయాలు, వనరులు, అవకాశాలు మొదలైనవి పెట్టుబడిదారులకు వివరించాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. చరిత్రలో మొదటి సారిగా కాశ్మీర్ లో పెట్టుబడి దారుల సదస్సు జరగబోతుంది. దీనితో కాశ్మీర్ లో కొత్త నవశకం మొదలు కాబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. 


ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రద్దయి, రాష్ట్ర పాలనా నడుస్తుంది. ఇప్పుడు కాశ్మీర్ ఎలాగూ కేంద్రం పాలిత ప్రాంతం కాబట్టి దేశంలోనే పెద్ద కంపెనీల పెట్టుబడి దారులను ఆకర్శించడమే లక్ష్యంగా కేంద్రం పలు కంపెనీల నేతలను ఇండియా కు రప్పించే యోచనలో ఉంది. దేశంలోని పెద్ద నగరాలైన .. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తో పాటు దుబాయ్, సింగపూర్ లాంటి చోట్ల రోడ్ షోలు నిర్వహించడానికి కేంద్రం అన్ని సిద్ధం చేసింది. 


ఈ జమ్మూ కాశ్మీర్ కున్న ప్రత్యేక అధికారాలను రద్ధు చేయడం ద్వారా దేశానికీ ఇంకా ఎన్నో లాభాలున్నాయని చెప్పాలి. ఈ నిర్ణయం ద్వారా కాశ్మీర్ ఇప్పుడు దేశంతో పాటు కలిసిపోతుంది. పార్లమెంట్ వేసే చట్టాలన్నీ ఇప్పుడు కాశ్మీర్ కు వర్తిస్తుంది. తద్వారా కాశ్మీర్ లో అభివృద్ధిని సాధించవచ్చు. మిగతా ప్రాంత ప్రజలతో కాశ్మీర్లను ఏకీకృతం చేయొచ్చు. పెట్టుబడుల ద్వారా కాశ్మీర్ ను అభివృద్ధి పధంలో నడిపించవచ్చు. ప్రత్యేక అధికారాలు రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ .. భారత్ లోని మిగతా రాష్ట్రాల మాదిరిగా కేంద్రం అదుపులోకి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా ఉగ్రవాదులను కంట్రోల్ లో పెట్టొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: