పాపం చిరంజీవి జారిపడ్డాడు, కాని ఆయనకు ఎదురవుతుందని భావించిన పెను ప్రమాదం నుండి మాత్రం బతికిపోయాడు. సోమవారం వరదప్రాంతాలను పరిశీలించడానికి వెల్లిన చిరంజీవి పడవలో ప్రయాణిస్తుండగా పడవనుంచి జారి నీళ్లలో పడ్డాడు. వెంటనే భద్రతా సిబ్బంది, పక్కన ఉన్నవారు ఆయన లేపి తిరిగి పడవలో కూర్చోబెట్టారు. కాకినాడ రూరల్ మండలం లో పర్యటిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కేంద్రమంత్రి హోదాలోనే ఆయన వరదప్రాంతాలలో పర్యటించాడు. నష్టపోయిన పంట పొలాలలను పరిశీలించాడు. బాదితులను పరామర్శించాడు. తగు సహాయం ప్రభుత్వం ద్వారా అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ సంధర్భంగా ఆయనకు బాదితులు తమ గోడును వెల్లగక్కుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత ఆయన సీమాంద్రలో ప్రజల వద్దకు వెల్లడం ఇది తొలిసారి. రాజీనామా చేసినప్పటికి ఆమోదించుకోకపోవడంతో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుందని భావించారు. కారణం సిఎం తో సహా వెల్లిన మరో కేంద్రమంత్రికి పనబాక లక్ష్మికి సెగ తగలడంతో చిరంజీవి విషయంలోను కాస్తా టెన్షన్ నెలకొనగా అదేమి లేకుండా ఆయనను ప్రజలు ఆదరించడంతో చిరంజీవి అభిమానులు, ఆయన వర్గం నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: