భారత్ దేశం రానున్న చమురు రారాజు

 

భారత దేశ చరిత్ర లో ఒక భారత సంస్థ లో అత్యధిక పెట్టుబడి పెట్టబోతున్న విదేశీ దిగ్గజ సంస్థ ఆరామ్ కో.  ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ తన నలభై రెండొవ వార్షిక సర్వ సభ్య సమావేశం లో తాము ఆరామ్ కో అనే విదేశీ సంస్థ తో జట్టు కట్ట నున్నామని, అదే జరిగితే మన దేశం లో అత్యధిక విదేశీ పెట్టుబడులు కలిగిన కంపెనీ గా తమ సంస్థ ఆవిర్భవించనున్నదని, శ్రీ ముఖేష్ అంబానీ చెప్పిన విషయం తెలిసినదే. 

 

ఒక భారత దేశానికీ చెందిన కంపెనీ తో భాగస్వామి కావడం ద్వారా ప్రపంచం లోనే అత్యధిక మార్కెట్ విలువను సొంతం చేసుకోవడమే కాకుండా, తన వ్యాపారాన్ని కూడా విస్తరించ వచ్చన్న ఉద్దశ్యం తో ఆరామ్ కో మన దేశానికి చెందిన దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడులు పెట్టడానికి నిశ్చయించుకున్నది.

 

భారత దేశం యొక్క స్టాక్ మార్కెట్ లో కూడా లిస్టింగ్ కావడానికి ఈ సంస్థ ప్రయత్నం.  

 

ఈ ఆరామ్ కో గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఏమిటంటే :

1 ఈ సంస్థ ప్రపంచం లోనే అతిపెద్ద దిగ్గజ చమురు సంస్థ.

2 ఈ సంస్థ ఇప్పటివరకు తన లాభాలను ప్రపంచానికి చెప్పలేదు.

3  ఈ ఆరామ్ కో మార్కెట్ విలువ 1 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్‌ డాలర్ల మధ్య  ఉంటుందని అంచనా.

4  ఆరామ్ కో సౌదీ లో చాలా పెద్ద సంస్థ.

5 ఈ సంస్థ గత సంవత్సరం 111.1 బిలియన్‌ డాలర్ల లాభాన్ని గడించింది.

6 ఈ సంస్థ 15  బిలియన్ డాలర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడి గా పెట్టనున్నాడని సమాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: