పట్టణ ప్రాంతాల ఇల్లు నిర్మాణం - సమీక్షా సమావేశం

 

ప్రస్తుత మన వ్యవస్థలో ఉన్న అన్ని రుగ్మతలకు అవినీతి తల్లివేరు వంటిదని, దాన్ని రూపుమాపడానికి మనమంతా కృషిచేయాలని,  తద్వారా అవినీతి రహిత సమాజంలో జీవించడం సాధ్యమవుతుంది ఈ మహత్కార్యం లో అందరూ తమ వంతు చేయూత అందించి, అవినీతి రహిత  సమాజం అనే స్వప్నాన్ని సహకారం చెయ్యాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పట్టణ ప్రాంతాల ఇల్లు నిర్మాణం పై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వం ఏ పని చేపట్టినా అందులో అవినీతి ఎంత మాత్రం ఉండకూడదన్నారు.   దీని కొరకు ప్రతి ప్రభుత్వ అధికారి తన వంతు గా పనిచేసి అవినీతిని రూపుమాపాలి అన్నారు.  పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం లో జరిగిన అవకతవకలు ఏవైనా ఉంటే వెలికి తీయాలన్నా రు. ఇప్పటికే లక్షకుపైగా  ఇళ్లను గుర్తించామని, అవన్నీ పునాది స్థాయిలోనే ఉందని, మిగిలిన లబ్దిదారులకు కూడా ఇల్లు మంజూరు చేయాలని శ్రీ వైయస్ జగన్  సూచించారు. దీనికి సంబంధించి మరల రివర్స్ టెండర్ లు చేపట్టమని సంబంధిత అధికారులను శ్రీ వైఎస్ జగన్ ఆదేశించారు. అలాగే రేట్లను ఖరారు చేయడానికి  ఒక వ్యవస్థను సంబంధిత నిపుణులతో కలసి ఇ తయారు చేసుకోవాలని దాని ద్వారా టెండర్లను ఖరారు చేయాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి తో పాటు, పురపాలక శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు  మరియు సంబంధిత అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: