పుట్టిన ఊరికోసం ఏదన్నా చేయాలనుకోవడం నిజంగా గొప్పదనమే. కానీ పుట్టిన పుడమి ఋణం తీరుచుకోవాలని అనుకోవడం మాత్రం ఓ మహత్తరమైన యజ్ఞం లాంటిది. ఎందుకంటే స్వార్ధంతో పేరుకుపోయిన సమాజంలో కుళ్ళుతో నిండిపోయిన మనుషుల్లో ప్రస్తుతం కనిపించేది వ్యక్తిగత స్వార్ధమే. తాను బాగుంటే చాలు, తన చుట్టుపక్కల ఉండే మనుషులు, ప్రాణులు, చివరికి ప్రాణవాయువుని అందించే పచ్చని ప్రకృతి కూడా ఏమయ్యిపోతే మనకేంటి అనుకునే వారే అధికశాతం కనిపిస్తూ ఉంటారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఒక మొక్కని నాటినట్టుగా ఫోజు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోతారు కానీ నా రూటే సపరేటు అంటున్నారు ఈ వైసీపీ ఎంపీ.

 Image may contain: 2 people, people smiling

ప్రకృతి అంటే ఆయనకి ప్రాణం, సమాజంలో తాను ,తన కుటుంభ సభ్యులు అనుకునే వ్యక్తికాదు ఆయన.  సమాజం అంటే ప్రకృతి, అందులో మనమందరం ఓ కుటుంభంలా ఉంటున్నాం అనుకుంటారు. అందుకే కాబోలు ఇప్పుడు ఆ ఎంపీ ఏపీ వ్యాప్తంగా అందరికి ఆలోచింపచేస్తున్నారు. తన వద్దకి ఎవరైనా మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినప్పుడు బొకేలు తీసుకురావద్దు, క్యారీ బ్యాగ్ లతో రావద్దు అంటూ కండిషన్లు పెట్టారు కూడా. అంతేకాదు అభిమానంతో మీరు తీసుకురాకుండా మానరు కాబట్టి ఒక మొక్కని తీసుకురండి అంటూ సందేశం కూడా ఇచ్చారు. తనని కలవడానికి ఆ ఎంపీ ఇంటికి వెళ్ళిన వారికి ఆ ఇంట్లో మొక్కలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

 

తనవద్దకి గంపగుత్తంగా వచ్చిన మొక్కలని తన సన్నిహితులకి ఇచ్చి వాటిని జాగ్రత్తగా పెంచమని మధ్య మధ్యలో వాటి గురించి ఆరా తీస్తాను అంటూ చెప్పడం సదరు ఎంపీకి మొక్కలపై, ప్రకృతిపై ఉండే ప్రేమని చెప్పకనే చెప్తాయి. అంతేకాదు ఇప్పుడు గనుకా మొక్కలని పెంచకపోతే  భవిష్యత్తు తరలాకి మనం ఇచ్చేది కాలుష్య కోరల్లో మగ్గిపోయే భూతల నరకాన్నే అనేది ఆయన ఉద్దేశ్యం అందుకే తాజాగా ఆయన ఓ వినూత్న ప్రయత్నానికి నాంది పలికారు. స్పందన ఎలా  ఉంటుందో తెలియదు కానీ సంకల్పం మాత్రం అయితే ఉంది అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దాంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్ అయ్యి నెటిజన్లచే ప్రశంసలు అందుకుంటోంది. అసలు ఆ ఎంపీ గురించి చెప్పలేదు, ఆ వినూత్న ఆలోచన గురించి చెప్పలేదు అనుకుంటున్నారా..సరే ఇంతకీ ఆ ఎంపీ ఎవరో కాదు..

 Image may contain: 5 people, people smiling, people standing and outdoor

పశ్చిమగోదావరి జిల్లాలో పొలిటికల్ టైగర్ గా పేరొందిన మాజీ మంత్రి దివంగత కోటగిరి విధ్యర్ధరావు గారి తనయుడు కోటగిరి శ్రీధర్. వైసీపీ నుంచీ ఏలూరు ఎంపీగా అఖండ మెజారిటీతో గెలుపొందిన కోటగిరి శ్రీధర్. అనతికాలంలోనే తన ప్రాంత ప్రజల మనసు గెలుచుకున్నారు. తన సరికొత్త ఆలోచనలతో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయ్యారు. తాను ఇచ్చిన ఒక చిన్న సందేశం అందరిని ఆలోచింప చేస్తోంది. రక్షా భందన్ అంటే అన్నా , అక్క .చెల్లి అనుభంధాలకి ఓ నిదర్సనం. అయితే ఇదే  రోజున కేవలం మానవ  సంభంధాలు మాత్రమే కాదు మనిషికి , ప్రకృతితో కూడా సంభంధం ఉంటుందని నిరూపించాలి, చెట్లు కూడా మనకి అన్నలా, అక్కలా, ఇంట్లో వ్యక్తిగా ఉంటూ మనం స్వచ్చమైన గాలిని పీల్చుకునేలా దోహద పడుతున్నాయని అందుకే వాటికి కూడా మనం రాఖీ కట్టాలి అంటూ ఓ సందేశాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టు సారాంశం యధావిధిగా...

 

ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం లోని పాఠశాలల విద్యార్ధినీ-విద్యార్దులూ.. మీ స్రుజనాత్మకతను ఉపయోగించి రాఖీ తయారుచేసి మీ పాఠశాలలో గాని, గ్రామంలో, ఇంటి ఆవరణలోని వ్రుక్షానికి కట్టి ఫొటో తీసి ఈ పోస్ట్ కి కమెంట్ రాసి రిప్లై ఇవ్వండి. ఉత్తమ రాఖీ కి...చిత్రానికి ప్రత్యేక బహుమతి

 Image may contain: 1 person, smiling, text

ఈ పోస్టు వైరల్ అవడంతో ఏలూరు ఎంపీ శ్రీధర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎంతో మంది ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ ఇలాంటి ఎంపీ ని ఎప్పుడూ చూడలేదు భావితరాల కోసం మీరు చేస్తున్న ఆలోచన ఎంతో మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొక్కలని ప్రేమిస్తూ వాటికి హాని కలిగించకూడదు అనే మనస్తత్వం ఉన్న ఇలాంటి ఎంపీలు అరుదుగానే ఉంటారు. ఎంపీ శ్రీధర్ ఇలాంటి వినూత్న ఆలోచనలతో మరింత ముందుకు వెళ్ళాలని యువత కోరుకుంటోంది. ఆయన నియోజక వర్గ ప్రజలు అయితే మా మంచి ఎంపీ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: