సైబర్ నేరాలు  వింత వింతలు

 సైబర్ నేరాలు అంతకంతకూ  పెరిగిపోతున్నాయి. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  కాదు ఏది దోచుకోవడానికి అనర్హం అన్నట్టు సైబర్ నేరగాళ్లు అందినకాడికి  అమాయక ప్రజల సొమ్మును దూసుకుపోతున్నారు. తమ సొమ్ము లుటీ జరిగిన తర్వాత గాని గుర్తించలేకపోతున్నారు అమాయక ప్రజలు.   చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా అప్పుడు లబోదిబోమని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా ఒకసారి దోపిడికి గురైన  డబ్బు తిరిగి రావడం లేదనే చెప్పాలి.

మీరు ప్రముఖ సంస్థ యొక్క లాటరీలో  కోట్లాది రూపాయలు గెలుచుకున్నారు ఆ డబ్బులు తీసుకోవడానికి  కొన్ని ఖర్చుల రూపేనా చెల్లించండి అటు తర్వాత మీరు గెలుచుకున్న  కోట్లాది రూపాయలు మీ సొంతమవుతాయి అని నమ్మబలికి అమాయక ప్రజల నుండి లక్షలాది రూపాయలు చోరీ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు సదరు సైబర్ నేరగాళ్లు.  

 అలాగే  సెర్చ్ ఇంజాన్ లో   వెతికితే దొరికే నకిలీ నెంబర్లతో మరో ముప్పు   తయారుగా ఉంది అమాయక ప్రజల మీద. ఖాతాదారుల సేవా విభాగం గా  భావించి ఫోన్ చేయగానే వేరు వేరు రకాలుగా అమాయక ఖాతాదారుల డబ్బులు   ఇష్టం వచ్చినట్లు దోచుకుని పోతున్నారు.

ఈ రకమైన మోసాలతో  ప్రజలను దోచుకుంటున్న వారిపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి.   ఎవరికి తమ రహస్య సమాచారాన్ని వేయకూడదు. బ్యాంకు లేదా మరే ఇతర  కంపెనీ కూడా ఖాతాదారుల రహస్య సమాచారాన్ని ఎంత మాత్రం తెలుసుకోదుఅనే విషయాన్ని అందరూ తప్పనిసరిగా  గుర్తుంచుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: