గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆగస్ట్ 15 వేడుకలను భరత దేశం జరుపుకుంతోంది. 1947 వేడుకలు దేశం ముక్కలు అయిన తరువాత జరిగాయి.  1948 వేడుకలు కాశ్మీర్ ని వేరు చేస్తూ చేసుకున్నాం. నాటి నుంచి నేటి వరకూ జెండా పండుగ చేసుకుంటున్నా ఎదో తెలియన్  ఓ అసంత్రుప్తి ఉండేది. భరతమాత సిగలో పువ్వు లాంటి కాశ్మీరంలో మువ్వన్నెల  జెండా సజావుగా ఎగరని వేళ ఈ వేడుకలకు అర్ధం ఉంటుందా అనిపించేది.


ఈసారి మాత్రం ప్రతి భారతీయుడు తలెత్తుకుని తిరిగేలా జెండా పండుగ చేసుకుంటున్న పరిస్థితి. సరిగ్గా పదిరోజుల క్రితం కాశ్మీర్ ని విభజిస్తూ 270 ఆర్టికల్ ని రద్దు చేస్తూ మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దాంతో కాశ్మీరంలో మువ్వన్నెల జెండా ఈసారి రెపరెపలాడుతుంది.  ఆ అందమైన అనుభూతి ప్రతి భారతీయుడు తన గుండెల్లో నింపుకుని మరీ గర్వంతో భారత మాతకు వందనం చేసే అపూర్వ ఘట్టం ఈ రోజు. 


 దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నో మతాలు, కులాలు, కల్చర్ ఉంది. అయినా అందరం ఒక్కటే అన్న భావన జాతీయ జెండా కల్పించింది. ఈ రోజున ఎవరైనా సరే అంతా ఒక్కటి. అందరూ ఆ జెండా నీడన సేదతీరలసిన వారే. అందుకే భారతీయుల సంబరాన్ని అంబరానికి తాకేలా చేస్తూ జెండా గర్వంగా ఎగురుతోంది.


 పైకి ఎగురుతూ భారతీయుల ప్రగతిని కూడా మరింత ఎత్తునకు తీసుకుపోతుంది. ఈసారి నుంచి భారత్ రూపు రేఖలు మారిపోతున్నాయి. సరికొత్త భారతావనిలో అంతా సుఖ శాంతులతో కళకళలాడేందుకు అడుగులు వేస్తున్న సుందర ద్రుశ్యం ఆవిష్క్రుతమవుతోంది. దేశ  73వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ సాటి భారతీయులు జై కొడుతున్న అరుదైన సన్నివేశం ఇదే.


మరింత సమాచారం తెలుసుకోండి: