రాష్ట్రంలో రాజకీయ నాయకుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలాఉన్నాయి? రాష్ట్ర విభజన, రాజకీయ పార్టీల మధ్య తీవ్రపోటీ.. ఇవి నాయకుల మధ్య అనుబంధాలను దెబ్బతీశాయా? దెబ్బతీయలేదా? అనే విషయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంది. పక్క రాష్ట్రం తమిళనాడు లో ఒక పార్టీకి మరో పార్టీకి పిలుపులు లేవు. ప్రధానంగా అన్నాడీఎంకే, డీఎంకే నాయకుల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది. ఒక పార్ట నాయకుడు మరో పార్టీ నాయకుడితో మాట్లాడితే.. అదో నేరం అవుతోంది! ఇటువంటి నేపథ్యంలో ఆంధ్ర్రపదేశ్ లో పరిస్థితిని సమీక్షిస్తే...    మన రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు పోరాడుతున్నాయి. ఇక కాంగ్రెస్ బీజేపీలు ఉండనే ఉన్నాయి. కమ్యూనిస్టులూ, లోక్ సత్తా ఉండనే ఉన్నారు. వీరందరి మధ్య నిత్యం విమర్శల వాన కురుస్తూనే ఉంది. ఈ నేతలంతా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు. వ్యక్తిగత విమర్శలకు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాల వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. ఒక పార్టీ నేతల ఇంటిల్లోని పెళ్లిళ్లకు మరో పార్టీ వారు రావడం, ఫోటోలకు పోజులివ్వడం ఇంట్రస్టింగ్ పాయింట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా తెలుగుదేశం ఎంపీ నిమ్మల కిష్టప్ప తన కుమారుడి పెళ్లికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందించాడు.  జగన్ ఇంటికి వెళ్లి నిమ్మల పెళ్లికి పిలిచివచ్చాడు! ఒకవైపు నిత్యం తెలుగుదేశం వాళ్లు జగన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీకి.. జగన్ తో ఈ మాత్రం సాంగత్యం ఉందంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయమే! అన్ని రాజకీయ పార్టీల వారినీ ఆహ్వానించినట్టుగానే జగన్ ను కూడా ఆహ్వానించాడు.. అనుకోవడానికి లేదిక్కడ! తెలుగుదేశం అధినేత ఇంటిలో జరిగిన పెళ్లిళ్లకు, ఆయన ఆధ్వర్యంలో జరిగిన పెళ్లిళ్లకు.. వైకాపా వారిని ఆహ్వానించలేదు! మరి అధినేతను ఫాలో అవ్వకుండా.. ఒక ఎంపీ జగన్ ను తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించాడంటే.. సమ్ థింగ్ ఈజ్ దేర్!

మరింత సమాచారం తెలుసుకోండి: