ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటి క్రితం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ నెల 22న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి అమెరికా పర్యటన ఇది. ఈరోజు బయలుదేరిన ఆయన వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఆగస్టు 16న వాషింగ్టన్ డీసీ, 17న డల్లాస్, 18,19 తేదీల్లో వాషింగ్టన్ డీసీ, 21, 22 తేదీల్లో షికాగోలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ అమెరికా షెడ్యూల్‌

  • ఆగస్టు 16న  ఉదయం 8.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ) సీఎం జగన్‌ వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అదే రోజు భారత అమెరికా రాయబారితో సమావేశాం అవుతారు. అనంతరం ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. సాయంత్రం అమెరికాలోని భారత్‌ రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. 
  • ఆగస్టు 17ను మధ్యాహ్నం 2 గంటలకు(భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30 గంటలకు) డల్లాస్‌ చేరుకుంటారు. 
  • అదే రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 తెల్లవారుజాము 4.30గంటలు)  డల్లాస్‌లో ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో  నార్త్‌ అమెరికా తెలుగు కమ్యూనిటీని కలుసుకొని, వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
  • ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీ లో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు.
  • ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనులపై పర్యటించనున్నారు.

  • ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగో లో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8.30గంటలకు ఏపీకి బయలుదేరుతారు.






మరింత సమాచారం తెలుసుకోండి: