రక్షా బంధన్ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోదరుడు రాహుల్ గాంధీ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక  ట్వీట్ చేశారు. రాహుల్‌తో పాటు తాను ఉన్న ఒక చిన్ననాటి ఫొటో ని  ప్రియాంక  "ప్రపంచంలోని ఉత్తమ సోదరుడు" అని  ట్వీట్ చేసింది.


"ప్రపంచంలో ఉత్తమ సోదరుడు" అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిని ట్యాగ్ చేస్తూ , ఇద్దరు పిల్లలు ఒకరికొకరు దగ్గరగా కూర్చున్న  ఫోటోను ప్రియాంక ట్విట్టర్‌లో పంచుకున్నారు.



లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకప్పుడూ ఇద్దరు దిగిన ఫొటో ఒక దానిని అభిమానులు పంచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ విమానాశ్రయంలో రాహుల్, ప్రియాంక ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు, కానీ వారు తమ సమావేశాలకు హాజరు కావడానికి వాళ్ళ దారులలో వెల్లారు.

“మంచి సోదరుడు అంటే అర్థం ఏమిటో నేను మీకు చెప్తాను. నేను  పెద్ద విమానాల లో  మరియు చిన్న హెలికాప్టర్‌లో వెళుతున్నాను. అలాగే ఆమె చిన్న విమానాలు మరియు పెద్ద హెలికాప్టర్‌లో వెళుతోంది, ”అని ఒక అభిమాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో లో రాహుల్  మాట్లాడిన మాటలకు   ప్రియాంక నవ్వుతూ,“ అది నిజం కాదు ”అని  సమాధానం ఇచ్చింది. 

ఆ వీడియో‌ మీకోసం

మరింత సమాచారం తెలుసుకోండి: