ఆయన అలాంటి ఇలాంటి నాయకుడు కాదు. రాజకీయ దురంధరుడు. ఆయన వంటి నేత లేరని లోకం వేన్నొళ్ళ  పొగిడించుకున్న నాయకుడు. జాతి హితమే లక్ష్యంగా చేసుకుని విలువలతో కూడిన రాజకీయం నెరిపిన అద్భుతమైన వ్యక్తిత్వం ఆయంది. ఆయన లేరంటేనే  భారత మాత శోకంతో తల్లడిల్లుతుంది.


ఆయనే మన పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్. వాజ్ పేయ్  సరిగ్గా నేటికి ఏడాది అయింది మనలను భౌతికంగా వీడిపోయి. గత ఏడాది ఇదే రోజున అటల్ 93 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని జనమంతా కలవరపడింది. ఈ దేశానికి సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్ష నాయకునిగా సేవలు అందించిన వాజ్ పేయ్ ఆరేళ్ళ పాటు ప్రధానిగా పాలించి  తనదైన ముద్రను అన్ని రంగాలలోనూ వేశారు.


వాజ్ పేయ్ వంటి నేత లేడు, రాడు అనిపించుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు. కాశ్మీర్ల మనసు గెలుచుకున్న ఏకైన నాయకుడు వాజ్ పేయ్. అదే విధంగా దాయాది పాక్ సైతం వాజ్ పేయ్ అంటే ఇష్టపడుతుంది. ఈ దేశంలో పుట్టి గిట్టిన వారు ఎందరో ఉన్నారు. కానీ చిరస్మరణీయులు కొందరే ఉంటారు. అటువంటి వారి కోవలోకి వాజ్ పేయ్ వస్తారన్నది అక్షర సత్యం.


ఇదిలా ఉండగా వాజ్ పేయ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, కవి, పండితుడు. ఆయన ప్రసంగాలల్లో కవితలు పొంగి పొర్తుతాయి. వినాలపించేలా ఉంటాయి. ఎన్నో సూక్తులు, సామెతలు అలవోకగా అందులో వస్తూంటాయి. వాజ్ పేయ్ ప్రసంగాలే పుస్తకాలురా రావడం జనాదరణ పొందడం మరో గొప్ప విశేషం. ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిన వాజ్ పేయ్ ఈ దేశమే తన కుటుంబం అనుకున్నారు. కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్ రద్దు కావాలని ఆయన కోరుకున్నారు.



అలాగే దేశంలోని అన్ని మతాలు ఒక్కటిగా కలసి మెలసి ఉండాలని, అదే అసలైన సెక్యులర్ భావన అని వాజ్ పేయ్ గట్టిగా నమ్మేవారు. హిందుత్వం ఒక మతం కాదని అది భారతీయుల జాతీయ విధానమని నొక్కి చెప్పిన గొప్ప నాయకుడు వాజ్ పేయ్ తరతరాలు గుర్తుంచుకోతగ్గ నేత.  అసలు సిసలు మన భారత రత్నం వాజ్ పేయ్.




మరింత సమాచారం తెలుసుకోండి: