యుధ్ధం..శాంతి పక్కపక్కనే ఉంటాయి. యుద్ధానికి ముందు శాంతి ఎపుడూ ఉండదు. ఆ విషయానికి  వస్తే శాంతి పోయాకే యుధ్ధం అన్న మాట వస్తుంది. ఇపుడు పాకిస్థాన్, భారత్ ల మధ్య శాంతి అన్నది లేదని అందరికీ తెలుసు. శాంతి పీకనులిమి పాక్ ఎపుడో పాతరేసింది. ఆ దేశానికి తనను తాను పాలించుకోవడం చేతకాదు. అక్కడి ప్రజలకు భారత్ ని బూచిగా చూపించాలి. అందుకు ఎపుడూ ఘర్షణ పడుతూనే ఉండాలి. ఇపుడు అదే చేస్తోంది.


పాక్ దుందుడుకు విధానాలతో యుధ్ధం తప్పేట్లు లేదు. పాక్ యుధ్ధానికి సిధ్ధమని చాలా కాలంగా చెబుతోంది. అవును మరి ఎంతసేపూ ప్రచ్చ‌న్న యుధ్ధం చేసి బోర్ కొట్టింది. ఇపుడు డైరెక్ట్ గా యుధ్ధం చేస్తే తన ప్రజల ముందు హీరో అనిపించుకోవాలనుకుంటోంది. అందుకోసం దేనికైనా సిధ్ధమని తెగిస్తోంది. మరి పాక్ ఇలా విర్రవీగుతూంటే భారత్ కి కూడా యుధ్ధం చేయడం అనివార్యమే అవుతుంది.


సరిహద్దుల్లో ఎపుడు ఉద్రిక్తతలు  అలా పెంచి పోషిస్తూ పాక్ తాను చేయాల్సింది చేస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేళ రాజౌలి సెక్టారో ముగ్గురు పాక్ సైనిక్లు హతం ఇదే విషయాన్ని ధువీకరిస్తోంది. అసలు పాక్ గోల అంతా భారత్ మీద పడి ఏడ్వడమే. దానికి తోడు మోడీ సర్కార్ ఎక్కడ గిల్లాలో అక్కడే గిల్లింది.  కాశ్మీర్ ని అడ్డుపెట్టుకుని 70 ఏళ్ళుగా కాల్చుకుని తింటున్న పాక్ కి వాతలు బాగా మోడీ పెట్టారు. ఇపుడు అందుకే పాక్ పెడ బొబ్బలు పెడుతోంది.  యుధ్ధం అంటూ రంకెలు వేస్తోంది. జీహాద్ అని పలవరిస్తోంది. మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని కూడా వెకిలిగా బెదిరిస్తోంది. 


మరి భారత్ కి ఇపుడు సహనం ఉండాలా అంటే ఎంత ఒదిగినా పాక్ వూరుకునేలా లేదు. దాంతో మోడీ కూడా తెగించి సై అంటూ సమరానికి సిధ్ధపడితే దాయాదుల మధ్య భీకర పోరుకు రంగం సిధ్ధమైపోయినట్లే. ఈ పరిణామాల్లో ఎవరు విజేత, మరెవరు పరాజితులు అన్నది చెప్పలేకపోయినా రెండు దేశాలకు మాత్రం తీవ్ర స్థాయిలో నష్టం జరగడం ఖాయమని అంటున్నారు. ఈ దెబ్బతో పాక్ కి బుద్ధి చెప్పాలని మోడీ సర్కార్ కూడా వ్యూహ రచన చేస్తోంది. మొత్తానికి పరిమితమో విశాలమో కానీ యుద్ధం మాత్రం తప్పేట్లు లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: