ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల వసతి గృహంలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. అర్దరాత్రి దాటిన తరువాత హాస్టల్ లోకి ప్రవేశించి ఓ అమ్మాయిని భయబ్రాంతులకు గురిచేశాడు. చంపేస్తానంటూ కత్తితో బెదిరించి అత్యాచార యత్నం చేశాడు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజిలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హాస్టల్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేచిన బాధితురాలు వాష్ రూంకు వెళ్లింది. అదే సమయంలో హాస్టల్ వెనుక వైపు ఉన్న గోడ దూకి దుండగుడు లోపలికి వచ్చాడు. బాత్ రూంలోకి ఆమె వెళ్లడం చూసి బయటుంచి గడి పెట్టాడు. కొద్దిసేపటికీ లోపల నుంచి ఆమె డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించగా రాలేదు.


ఆందోళన చెందిన ఆమె డోర్ ను గట్టిగా కొట్టడంతో దుండగుడు బాత్రూం గోడపైకి ఎక్కాడు. అరిస్తే చంపేస్తానంటూ ఆమెను కత్తితో బెదిరించాడు. తర్వాత బాత్రూంలోపలికి  వంగి డోర్ గడి తీసి ఆమెను బయటకు లాక్కొచ్చాడు. బాధితురాలి అరుపులకు నిద్రిస్తున్న అమ్మాయిల లేవడంతో వారి గదులకు బయట నుంచి గడి పెట్టాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడం గదుల్లోని అమ్మాయిలు కూడా పెద్దగా అరవడంతో దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ బాధితురాలి నుంచి సెల్ ఫోన్ ను లాక్కున్నాడు, కింద పార్క్ చేసి ఉన్న ఓ బైక్ సీటును కత్తితో కోసి గోడ దూకి పారిపోయాడు. బాధితురాలి ఫోన్ పగిలిపోయిన స్థితిలో ఆ గోడ వద్ద లభ్యమైంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.


బాధితురాలి నుంచి పోలీసులు పూర్తి వివరాలనూ సేకరించారు. తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఘటన పై క్లూస్ టీం టాస్క్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ కి కాంపౌండ్ వాల్ సరిగ్గా లేకపోవటం వల్ల సెక్యూరిటీ విధులు నిర్వహించకపోవటం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. గతంలో కూడా దొంగతనాలు జరిగాయి కానీ రాత్రి పూట బయట వ్యక్తులు రావాటం వచ్చి బెదిరించటం ఇలాంటివి జరగలేదని హాస్టల్ విద్యార్ధులు తెలుపుతున్నారు. నిన్న రాత్రి మాత్రం ఒక ఆగంతకుడు వచ్చి బాత్రూం కి వెళ్ళినటువంటి యువతిని కత్తితో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించడంపై కూడా ఉస్మానియా హాస్టల్ విద్యార్థులు అందరు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంపౌండ్ వాల్ తో పాటు రికేర్డ్ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని మార్చాలని విద్యార్ధులు ఆందోళన తెలుపుతున్నారు. ఎందుకంటే వారి వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనలో నింధితుడు ఎవరు అనేదానిపై కూడా పోలీసులు ఆరా తిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: