రాజమండ్రి అంటే చక్కటి పచ్చదనం,తీయ్యటి తీపి పదార్ధాలు మనకు గుర్తోస్తాయి.అయితే ఇప్పుడు రాజమండ్రిలో వేడి వాతావరణం చోటుచేసుకుంటోంది. రాజమండ్రి అర్బన్ వైసీపీలో విభేదాలు శృతిమించుతున్నాయి. అక్కడ గ్రూపు రాజకీయాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అవి చెక్ పెట్టేందుకు ఎవరు రంగం లోకి దిగుతున్నారు. రాజమండ్రి అర్బన్ పార్టీ కి కొత్త ఇన్ చార్జిగా ఎవర్ని నియమించబోతున్నారు, మరి ఇప్పటికే ఇన్ చార్జ్ గా ఉన్న రౌతు సూర్యప్రకాశరావును ఎలా బుజ్జగిస్తారు అని అందరి మదిలో ఉన్న ప్రశ్న. అయితే రాజమహేంద్రవరం అర్బన్ నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ రౌతు సూర్యప్రకాశరావు కి అలాంటి అండ్ కొరవడిందట అందువల్లే ఆయన పేరులో ఉన్న వెలుగు రాజకీయంగా ఉండడం లేదని రాజకీయ వర్గా లు విశ్లేషిస్తున్నాయి.


ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ పార్టీ హవా బలంగా వీచింది. కొన్ని చోట్ల మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీచింది. రాజమండ్రిలో కూడా పార్టీ చుక్కెదురైంది. ఇక్కడ ఓటమిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందే ఊహించింది టాక్. రాజమండ్రి అర్బన్ నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. దీంతో అసెంబ్లీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుకి స్థానిక నాయకుల మధ్య సత్సంబంధాలు కొరవడ్డాయి. అంతేగాక బహు నాయకత్వం వారి మధ్య ఆధిపత్య పోరాటం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ లేకపోవటం వంటివి రాజమండ్రిలో ఫ్యాన్ పార్టీకి ప్రతికూలంగా మారిపోయాయి. ఈనేపధ్యం లో రాజమండ్రి అర్బన్ నియోజక వర్గం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోందట.



నిజానికి తెలుగు దేశం పార్టీకి రాజమహేంద్రవరం కంచుకోటతో సమానం, ఈ నగర పాలక సంస్థ కు జరిగిన ఎన్నికల్లో టిడిపి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. మూడు సార్లు టిడిపికే మేయర్ పీఠం దక్కింది. కార్పొరేషన్ పరిధి లో తెలుగు దేశం పార్టీ కి బలమైన క్యాడర్ ఉంది. ప్రతి డివిజన్ లోనూ చురుకైన కార్యకర్తలున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ నియోజక వర్గాల్లో టిడిపి కైవసం చేసుకుంది. అదే ఊపుతో రాజమండ్రి నగర పాలక సంస్థ పై వరుసగా నాలుగో సారి పసుపు జెండా ఎగురవేయటానికి టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల్లో రాజమండ్రి కోటుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ముఖ్య మంత్రి జగన్ లక్ష్యంగా పెట్టు కున్నారట.



ఈనేపధ్యం లో స్వయంగా ఆయనే రాజమండ్రి అర్బన్ నియోజక వర్గ పార్టీ ఇన్ చార్జి మార్పు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా అర్బన్ లో పార్టీ ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు నాటి నుంచి నెలకొన్న పరిస్థితులను ఆయన సీఎం జగన్ దృష్టి కి తీసుకువెళ్లారు మరోవైపు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా అర్బన్ లో పార్టీ బలోపేతం కావాలని పట్టుదల కనబరుస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజా పోటీ చేసినప్పటికీ రాజమండ్రి అర్బన్ లో ఆయన కు మంచి పట్టుంది. అర్బన్ పార్టీ కేడర్ లో చాలా మంది జక్కంపూడి రాజా తో సంబంధా లు కొనసాగిస్తున్న.



ఈ నేపధ్యం లో ఆయన మద్దతున్న వారికే రాజమండ్రి అర్బన్ నియోజక వర్గం అధ్యక్ష పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జక్కంపూడి రాజా కూడా రాజమండ్రి అర్బన్ లో పార్టీ ఓడిపోయినప్పటికీ కార్యకర్తల కు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు రాజమండ్రి అర్బన్ నియోజక వర్గ ఇంచార్జి గా ఉన్న రౌతు సూర్యప్రకాశరావు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీలో కొందమంది నాయకు లు తనకు సహకరించకపోవడం వల్లే తాను ఓటమిపాలయ్యానన్న భావనలో ఆయనున్నారు .ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితు లను రౌతు సూర్యప్రకాశరావు కూడా పార్టీ అధినేత జగన్ దృష్టి కి తీసుకెళ్లారని ఈ సందర్భం లోనే రాజమండ్రి అర్బన్ నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మార్పు విషయమై తన నిర్ణయాన్ని రౌతుకు జగన్ ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం.


ఈ తరుణం లోనే రౌతు కొంచెం స్తబ్దు గా ఉంటున్నారట పార్టీ కార్యక్రమాలు కూడా ఆశించిన స్థాయి లో జరగడం లేదని తెలుస్తోంది. అందరూ నాయకులే తప్ప కార్యకర్త లేని పరిస్థితి పార్టీ లో నెలకొన్నది రాజమండ్రి అర్బన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కొంత మంది నాయకుల ఆధిపత్య పోరు వల్ల పార్టీ లో క్రమ శిక్షణ లేదన్న భావన రానురాను బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో రౌతు సూర్యప్రకాశరావుని పార్టీ ఇన్ చార్జి పదవి నుంచి తొలగిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయన వర్గం కూడా డీలా పడింది. రాజమండ్రి అర్బన్ నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి గా ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం నియమిస్తారన్న వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నార ని ఈ మేరకు త్వరలో ప్రకటన కూడా వస్తుంద ని పార్టీ నాయకు లు గట్టి గా చెపుతున్నారు.


శివరామసుబ్రహ్మణ్యం నియామకం ద్వారా రాజమండ్రి అర్బన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని అధిష్టానం లక్ష్యం గా కనిపిస్తోంది. శివరామసుబ్రహ్మణ్యం వర్గం కూడా దాదాపు తమ నాయకుడికి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది. సుబ్రహ్మణ్యానికి రాజమండ్రి ఎంపి మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జిల్లా మంత్రుల పిల్లి సుభాష్ చంద్రబోస్ పినిపే విశ్వరూప్ లో మద్దతు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.వైఎస్ఆర్సిపీ జెండా ఎగురవేయడానికి శివరామసుబ్రహ్మణ్యం పార్టీ ఇన్చార్జ్ గా నియమితుడవుతాడా, లేదా మన ముఖ్యమంత్రి ఇంకేమైన వ్యూహాలు రచిస్తున్నారా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: