కరకట్ట మీద అక్రమనివాసంలో ఉంటున్న చంద్రబాబునాయుడు ఇంట్లో ఇల్లీగల్ వ్యవహారాలు నడుస్తున్నాయా ? ఇదే ప్రశ్నను మంత్రి కొడాలి నాని చంద్రబాబును ఉద్దేశించి సూటిగా  ప్రశ్నించారు. వరద ఉధృతి తెలుసుకునేందుకు ప్రభుత్వమే ద్రోన్లను ప్రయోగించిందని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు అండ్ కో ఎందుకు ఇంతగా రచ్చ చేస్తున్నారంటూ కొడాలి మండిపోయారు.

 

భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది ప్రవాహం, కరకట్ట పరిస్ధితి తెలుసుకునేందుకు తామే ద్రోన్లను ప్రయోగించినట్లు  ఇరిగేషన్ శాఖ చెబుతున్నా చంద్రబాబు, టిడిపి నేతలు ఎందుకు రచ్చ చేస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు మంత్రి.  చిత్రీకరణలో భాగంగా ద్రోన్లు కరకట్ట మీదున్న అన్నీ కట్టడాలను షూటింగ్ చేసిందని అందులో భాగంగానే చంద్రబాబు ఇంటిపైన కూడా ఎగిరుంటుందని మంత్రి అన్నారు.

 

చంద్రబాబు ఇంటి మీద ద్రోన్లు ఎగిరినంత మాత్రనా ఆయన  భద్రతకు ఏదో అయిపోయిందని టిడిపి నేతలు గోలచేయటం ఏమిటి ? అంటూ కొడాలి మండిపోయారు. చంద్రబాబు ఇంటిని ఎవరు ఫొటోలు తియకూడదా ? చంద్రబాబు ఇంటి చుట్టు ద్రోన్లు తిరక్కూడదా ? అంటూ నిలదీశారు.

 

ఫొటోలు తీయకూడదు, ద్రోన్లు తిరక్కూడదంటే చంద్రబాబు ఇంటిలో ఏమన్నా ఇల్లీగల్ యాక్టివీటిలు జరుగుతున్నాయా ? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అయినంతమాత్రానా ఆయన ఇంటిపైన ద్రోన్లు తిరక్కూడదా ? అంటూ మంత్రి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు అండ్ కో సమాధానం చెబుతుందా ?

 

సరే ఈ విషయాన్ని పక్కనపెడితే నదీ ప్రవాహం ఎలాగుంది ? ముంపు ప్రాంతాల్లో పరిస్ధితేంటి ? అనే విషయాలను తెలుసుకునేందుకు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులే ఓ ఏజెన్సీకి చెందిన ద్రోన్లను ఉపయోగించుకుంటున్నారు. ఆ ద్రోన్లు కరకట్టకు రెండు వైపులా ఉన్న ప్రాంతాలను చిత్రీకరిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ఇంటి మీద కూడా ఎగిరింది. ఆ విషయాన్ని గమనించిన చంద్రబాబు సిబ్బంది వెంటనే నేతలకు కబురు చేశారు. దాంతో ఇంకేముంది చాలామంది నేతలు కరకట్ట మీదకు వచ్చేసి చంద్రబాబు  భద్రతపై ఒకటే రచ్చ మొదలుపెట్టారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: