ఉజ్వల స్కీం ఇప్పుడు  మహోజ్వలo కానున్నది

పేద మధ్య తరగతి వర్గాల వరకు కేంద్ర  ప్రభుత్వం త్వరలో ఒక శుభవార్త అందించే పోతుందేమో అని తెలుస్తుంది.   పేదలకు వంటగ్యాస్ సిలిండర్ మీద ఇచ్చే సబ్సిడీని పెంచాలని సీసీఏపీసీ కేంద్ర ప్రభుత్వం  నకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ వల్ల  పేద మరియు దిగువ తరగతి కి చెందిన వినియోగదారులు ఎవరు ఆశించిన మేర లబ్ధి పొందడం లేదని,  ఒకవేళ సబ్సిడీ ధరలకు పెంచితే ఈ వర్గాలు ఆకర్షితులై వంటగ్యాస్ ను వినియోగించుట అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సగటున ఒక్కొక్క గ్యాస్ కనెక్షన్లకు మధ్యతరగతి ప్రజలు మరియు పేద ప్రజలు 3 సిలిండర్లు మాత్రమే వాడుతున్నారు దీనిని 9 వరకు పెంచాలని తద్వారా వంట చెరువు ద్వారా చేసే వంటలు  వల్ల వచ్చే కాలుష్యాన్ని అరికట్టవచ్చు అనుకుంటున్నారు

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం  వంటగ్యాస్ సబ్సిడీ రూపకంగా 32 వేల కోట్ల పైచిలుకు ఉన్నది అయినప్పటికీ గ్యాస్ సిలిండర్ ఖరీదు చేయడం   భారంగా భావిస్తున్న గ్రామీణ ప్రాంతాల వారు ఇంకా వంటను ఈ వంట గ్యాస్ మీద కాక కాలుష్యాన్ని అధికంగా వెదజల్లే వంట చెరుకు పైనే ఆధారపడి వంటలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.   దీన్ని నివారించడానికి ఒక మంచి ఉపాయమే గ్యాస్ సిలిండర్ కు ఇచ్చే సబ్సిడీ నీ పెంచడం. ఈ వంటచెరుకు వెదజల్లే కాలుష్యం వల్ల ఏటా నాలుగు లక్షలమంది మరణిస్తున్నారని ఒక అంచనా. ఈ రకమైన మరణాలను కూడా నిరోధించగలిగే ఎటువంటి అవకాశం గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీ పెంచడం ద్వారా కలుగుతుందేమో అని అనుకుంటున్నారు.   

ప్రభుత్వ రాయితీలను ఉపయోగించుకుని కాలుష్య భూతం  మన దరిచేరకుండా తరిమేసే ఈ మంచి ఆలోచన కేంద్ర ప్రభుత్వం గనక  అమలు చేస్తే పేద మధ్యతరగతి వర్గాలను రక్షించినట్లు అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: