కాసేపట్లో ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశాన్ని చర్చించనున్నారు. ఎటూ తేలక పోవడంతో ఏం చేసేది లేక పాక్ అంతర్జాతీయ వేదికను ఆశ్రయించింది. దీనికి చైనా వంత పాడటంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీనిపై రహస్య చర్చ జరగనుంది. ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు జమ్మూకాశ్మీర్ విభజనపై కాసేపట్లో భేటీ జరగనుంది. భారత్ తీసుకున్న నిర్ణయంపై చర్చించనుంది ఐక్యరాజ్య సమితి. అయితే ఐదు శాశ్వత సభ్య దేశాల్లో చైనా మినహా మిగిలిన నాలుగు దేశాలు భారత్ కే మద్దతు తెలుపుతున్నాయి. ఈ వ్యవహారంలో మొత్తం కథను వెనకుండి నడిపిస్తున్నది డ్రాగన్ కంట్రీ చైనా.


చైనా చేతి లో కీలుబొమ్మగా మారాడు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్. భారత్ లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ ఇమ్రాన్ పనికిమాలిన కామెంట్ లు చేశారు. భారత్ తో యుద్ధానికి సిద్ధమంటూ రెండ్రోజుల కిందట ప్రకటన చేసిన ఇమ్రాన్ మన దేశంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. అలాగే భారత్ కి చేసేటటువంటి ఎగుమతులు, దిగుమతులను రద్దు చేసుకున్నందువల్లే పాక్ అంతిమంగా నష్టపోయింది. కేజీ టమోటో మూడు వందల రూపాయలు పలుకుతోందక్కడ. భారత్ కి వచ్చేటటువంటి దిగుమతుల కంటే పాక్ కు భారత్ నుంచి వెళ్ళేటటువంటి ఎగుమతులే ఎక్కువ కాబట్టి అంతిమంగా పాక్ ఏ నష్టపోయింది.


ఇక ఏ విధంగా ఏమీ జరగడం లేదని పాక్ తో జత కట్టి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వేదిక మీదకి పాక్ అంశాన్ని తీసుకెళ్లింది. భారత్ పదేపదే చెబుతోంది కశ్మీర్ మూడొందల డెబ్భై రద్దు, కశ్మీర్ అంశం ఏదయితే ఉందో అదంతా కూడా భారత్ అంతర్గత వ్యవహారం. పక్క దేశాలు తలదూర్చవలసిన అవసరం లేదు అంటూ, పదేపదే చెబుతున్నప్పటికీ కూడా పాక్ కడుపు మంట తీరడం లేదు. ఏ విధంగా రద్దు చేస్తారు. ఆ తరవాత పీవోకె మీద దృష్టి సారిస్తాం అంటూ అమిత్ షా వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ విషయం పాక్ కి మింగుడుపడడం లేదు. ఈ నేపధ్యంలో ఎన్ని రకాలుగా ఏమేం చేయాలో అవన్నీ చేస్తోంది దీనికి చైనా మద్దతు నిస్తుంది. చైనా ప్రత్యక్షంగా మద్దతు నివ్వనప్పటికీ పాకిస్థాన్ వెనకుండి చైనా పాక్ ను ముందుకు నడిపిస్తోంది.



ఇమ్రాన్ ఖాన్ చైనాకి ఒక చెంచాగా మారాడని చెప్పుకోవాలి. చైనా మద్దతు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ అంశాన్ని చర్చించబోతున్నారు. అనేక దేశాల్లో ఇలాంటి అంశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కానీ, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ చైనా భద్రతా మండలిలో సభ్యదేశంగా ఉంది. ఈ అండ చూసుకొని చైనా ప్రస్తుతం ఈ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. అయితే ఉన్నటువంటి అయిదు దేశాల్లో నాలుగు దేశాల మద్దతు భారత్ కు ఉంది.   ఒక్క చైనా మాత్రమే పాక్ తో జత కట్టి ఈ అంశాన్ని ఏదో యాగీ చేసి లబ్ది పొందాలని చూస్తోంది. కానీ అంతిమంగా జరిగేది మాత్రం ఏమీ ఉండదు కాస్త చర్చ జరుగుతుంది కాస్త అంతర్జాతీయ మీడియాలో అంతర్జాతీయ సమాజంలో విషయం కాస్త హైలెట్ అవుతోంది. అంతకు మించి భారత్ కి జరిగే నష్టం ఏమీ ఉండదు

మరింత సమాచారం తెలుసుకోండి: