ఆరోగ్యశ్రీ పై ప్రైవేటు ఆసుపత్రులతో మంత్రి ఈటెల చర్చలు కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ లో రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఈటెల ఎన్నికలు ఉండటంతో బడ్జెట్ నిధులు విడుదల చేయలేకపోయాం అన్నారు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ సమక్షంలో ఆరోగ్యశ్రీ ఎవరైతే నిలిపివేశారో ప్రైవేట్ హాస్పటల్స్ అన్నీ కూడా సమావేశం జరిపింది. ప్రధానంగా వాళ్ళ నాలుగు డిమాండ్ లను ఆరోగ్యశాఖామంత్రి ముందు ఉంచారు. ఏవైతే రావాల్సినటువంటి బకాయిలు 1500 కోట్ల రూపాయలు మాకు వెంటనే చెల్లించాలని ప్రైవేటు ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. దాంతోపాటు ప్రతిసారి తమ బకాయిల కోసం ఆంధోళన చేయాల్సి వస్తుంది అని, అలా కాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా మాకు నిధులను చెల్లించండని చెప్పి ప్రైవేట్ హాస్పత్రి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.


అంతేకాదు 20072008 తర్వాత మళ్లీ ఎంఒయు లో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎంఒయు కూడా మార్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్తితి. అయితే అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రోగులు ఇబ్బంది పడుతున్నారు. దాంతో వెంటనే మీరు ఈ సేవలను కంటిన్యూ చేయమని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి కోరారు. అయితే ప్రస్తుతానికి మాత్రం, అంటే గతంలో జరిగినటువంటి వరుసగా వచ్చినటువంటి ఎన్నికలు కావచ్చు దాంతో పాటు ముందటి బడ్జెట్ ఏదైతే ఉందో అది ఆ ఓటాన్ అకౌంట్ మాత్రమే పెట్టాము కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని ఈసారి సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతున్నాము.


ఆ బడ్జెట్ లో ప్రైవేట్ హాస్పత్రులకు రెండొందల కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి ఈటల హామీ ఇచ్చారు. కానీ ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు గంటలు అవుతుంది. అంటే ఒక్కో హాస్పత్రి తమకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మీ సమస్యలన్నింటిని కూడా మేము పరిష్కరిస్తాం ఇప్పుడు జరిగినటువంటి ఇబ్బందులు మళ్ళి మళ్ళి ఉండవని చెప్పి మంత్రి హామి ఇస్తున్నారు. కాని ప్రైవేట్ హాస్పటల్స్ కి మాత్రం నిధులు కనీసం ఇప్పటికే 500 కోట్లు బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో 500 కోట్ల రూపాయలైనా సరే మాకు చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది.దీనివల్ల మరో పక్క రోగులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.



రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేటు హాస్పటల్స్ 220 నర్సింగ్ హోమ్స్ దాంతోపాటు 20 కార్పొరేట్ హాస్పిటల్స్ కేర్, అపోలో,యశోద ఇవన్నీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ఆరోగ్యశాఖ మంత్రి అందరూ కలిసి వీళ్ళని వెంటనే వారి వారి బాధ్యతల్లో కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నారు. మంత్రి స్వచ్చమైనటువంటి హామి ఇస్తే విరమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ 200 కోట్ల రూపాయల వద్ద చర్చ జరుగుతుంది. అవి 500 కోట్లు ఇస్తే తమ సేవలను కంటిన్యూ చేస్తామని చెప్పి ప్రైవేటు హాస్పటల్స్ చెప్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: