జగన్ ప్రొగ్రాం షెడ్యూల్ పెట్టుకున్నారంటే మార్చుకోరు. ఆయన గత రెండేళ్ల బట్టి పాదయాత్రలో బిజీగా ఉండడంతో వ్యక్తిగత పనులు కూడా చాలా పెండింగులో పడ్డాయి. ఇంతలో ఎన్నికలు రావడం ఏకంగా సీఎం కావడం జరిగిపోయింది. ఈ నేపధ్యంలో వూపిరి సలపని పనులతో జగన్ బిజీగా ఉన్నారు. అయినా సరే వ్యక్తిగత పనుల కోసం విదేశాలకు వెళ్లాల్సివస్తోంది.


సరిగ్గా గోదావరికి వరదలు వచ్చే సమయంలో జగన్ జెరూసలెం టూర్లో ఉన్న్నారు. అపుడు ఉగ్ర గోదావరి తన ప్రతాపం చూపించింది. ఏకంగా రెండు జిల్లాలను అతలాకుతలం చేసింది. జగన్ జెరూసలెం టూర్లో  ఉండగా వరదలు రావడంతో టీడీపీ బురద రాజకీయం మొదలెట్టేసింది. ఇక జగన్ వచ్చిన తరువాత ప్రధాని తో ఢిల్లీలో భేటీలు ఉండడంతో వెళ్లారు. అటునుంచి వచ్చి ఏరియల్ సర్వే చేసిన జగన్  గోదావరి వరదల విమర్శలను ఎలాగో తప్పించుకున్నారు.


ఇపుడు కూడా అలాగే జరుగుతోంది. జగన్ అమెరికా టూర్ కు వెళ్లారు. ఆయన వెళ్లిన తరువాత నుంచి క్రిష్ణమ్మ మరింత ఉగ్ర రూపం దాల్చి వరదలై పొంగిపొరలుతోంది. దాంతో క్రిష్ణా పరివాహిక పరిసరాల ప్రజలు భీతిల్లిపోతున్నారు. మంత్రులు, అధికారులు సమీక్షలు చేస్తూ సహాయ చర్యలు చేపడుతున్నారు. కానీ సీఎమ్ గా  జగన్ లేని లోటు ఉండనే ఉంటుంది. పైగా మరో సారి టీడీపీకి జగన్ని విమర్శించే అవకాశం వచ్చింది. మాజీ మంత్రి దేవినేని ఉమ చాలు మాటలతో చెడుగుడు ఆడుకోవడానికి.


ఆయన అయ్యా జగన్ గారు మీరు అమెరికాలో ఉన్నారు. ఇక్కడ వరదలతో దారుణంగా ఉంది, మీ సర్కార్ ఇంతేనా అంటూ విమర్శలు మొదలెట్టారు. మరి జగన్ ఏం చేయగలరు. ఆయన ముందుగా అనుకున్న ప్రోగ్రాం అది. దాంతో జగన్ ఈసారి కూడా విమర్శలకు బలి కాకతప్పలేదు. ఏది ఏమైనా వరద రాజకీయంతో బురద జల్లేందుకు టీడీపీ రెడీగా ఉంటే జగన్ విదేశీ టూర్లు కావాలనే అవకాశం ఇస్తున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: