జనసేన పార్టీ మొన్న ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒకే ఒక సీటుతో సరిపెట్టుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. 2014 లో టీడీపీకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ సారి ఒంటరిగా భరిలో దిగటంతో అందరి కళ్ళు జనసేన మీద కూడా పడింది. జనసేన ఎన్ని సీట్లు గెలవగలదని అప్పట్లో బాగా డిస్కషన్ జరిగింది. చాలా మంది చాలా రకాలుగా విశ్లేశించారు. కానీ ఫలితాల్లో మాత్రం జనసేన ఘోర ఓటమిని చవిచూసింది. ఎంతలా అంటే చివరికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం. అయితే జనసేన ఓటమి తరువాత చాలా మంది ఆ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.


జనసేన పార్టీ కూడా ఎన్నో రివ్యూ మీటింగ్స్ పెట్టి ఓటమికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఓటమికి గల కొన్ని కారణాలను ఆ పార్టీ ఇంకా నేర్చుకొనే దశలో లేదని చెప్పాలి. నిజానికి జనసేన ఓటమికి ఒక్క సరి మనం కారణాలు చూస్తే మొదటి నుంచి కూడా జనాలు పవన్ కళ్యాణ్ ను ఒక సీరియస్ పొలిటిషన్ గా చూడకపోవటం దానికి కారణం పవన్ సభల్లో మాట్లాడే వీర ఆవేశం. ప్రజలు ఒక రాజకీయ నాయుకుడిలో ఇంత ఆవేశంగా మాట్లాడితే జనాలు అంత ఈజీగా నమ్మరు. పవన్ ప్రతి సారి సినిమా డైలాగ్స్ చెప్పటం వల్ల ఒక సినిమా హీరోగానే చూసారే తప్ప, ఒక విజన్ ఉన్న నాయకుడిలా కనిపించలేదు.


అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే .. ఆయన ఏమన్నారంటే కొంత మంది అసంతృప్తులు నన్ను విమరిస్తూ పోస్ట్ లు పెడుతున్నారని వారిని బుజ్జగించడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదని . జనసేన అని చెప్పుకొచ్చారు. వారి చుట్టూ చేరి తిరుగుతున్న  జన సైనికులు అది వారి బలం అనుకుంటున్నారని .. అది పవన్ కళ్యాణ్ బలమని తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. అయితే ఒక నాయడుకిడిని చూసే చాలా మంది ఓట్లు వేస్తారు. అయితే పవన్ ఇలా బహిరంగంగా నేను లేకపోతే మీరు జీరో అనే విధంగా మాట్లాడితే మొదటికి మోసం వస్తుంది. ఇలా మాట్లాడితే పవన్ పాతికేళ్ళు పార్టీని కాపాడుకోగలడా ?

మరింత సమాచారం తెలుసుకోండి: