రాష్ట్రం అంతా వరదల తాకీడీతో అల్లకలోలం అవుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ వరద తాకీడీ మన చంద్రబాబు నివాసంకు కూడా ప్రభావం చూపించింది.చంద్రబాబు గారు ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకునే వ్యక్తి కాదు. రాజకీయాలంటే ఏమిటి అవి ఏ రకంగా ముందు కు సాగుతాయి అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ తన సెక్యూరిటీ విషయంలో కాస్తంత సైలెంట్ గా ఉంటారు చంద్రబాబు అని భువనేశ్వర్ లాంటి వాళ్లు ఎప్పటికప్పుడు ఆయన మీద కోప్పడుతునే ఉంటారు.


కానీ ప్రజల కోసమే ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఉండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో దూసుకుపోతుంటారు. అలిపిరి ఘటన తరువాత కూడా ఆయన ఏ రోజూ ఎక్కడికైనా వెళ్లడానికి భయపడలేదు.సెక్యూరిటీ విషయంలో ఏ ప్రభుత్వం ఎలా ప్రవర్తించినా తాను కోర్టుకు వెళ్లి అసలు విషయాలు తెల్చుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సెక్యూరిటీ గురించి ఆయన జాగ్రత్త పడాల్సిన టైమొచ్చింది అని అంటున్నారు. తన ఇంటి దగ్గర జరిగిన ఎటువంటి కుట్ర వీడియో మొత్తం ఆయన కేంద్రానికి పంపారని ఆ తర్వాత అమిత్ షాకి ఒకే ఒక్క ఫోన్ కొట్టారని వార్తలొస్తున్నాయి. ఇందులో జరినటువంటి అంశాలేంటి.


అసలు రాష్ట్రం లో ఏంజరుగుతుంది. జగన్మోహనరెడ్డి అమెరికా వెళ్లినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోను సమయంలో అసలు రాష్ట్రం లో ఏం జరుగుతుందో ఇప్పుడు అందరి మనసుల్ని కదిలిస్తున్న ప్రశ్న. చంద్రబాబు నివాసం పైన అతిపెద్ద కుట్ర జరిగిందని టిడిపి యొక్క ప్రధాన ఆరోపణ. అసలు ఏం సాధించడం కోసం ప్లాన్ చేశారు అనేది ప్రశ్న కేవలం చంద్రబాబు ను అల్లరి చేయటం కోసం అయినా లేక ఏదైనా కుట్ర ఉందా అనేది ప్రశ్న రీసెంట్ గా చంద్రబాబు ఉండవల్లి నివాసం దగ్గర అలజడి రేగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చెయ్యి నొప్పి కారణం గా హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న వేళ ఆయన నివాసం దగ్గర సెక్యూరిటీ వాళ్లు కొంత మంది తెలుగు దేశం నేతలు ఉన్నారు. అయితే ఈ సమయంలో వారికి కొంత మంది అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది.


వాళ్ల దగ్గర పెద్ద పెద్ద బాక్సు లు కూడా ఉన్నాయి అయితే వారు మాత్రం చంద్రబాబు సెక్యూరిటీ దగ్గర ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా అక్కడికొచ్చి డ్రోన్ లు పైకి లేపారు. అయితే ఎందుకిలా చేస్తున్నారు అని నిలదీసిన వినలేదు దీంతో అక్కడ చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డు కునే ప్రయత్నం చేసినట్టు గా తెలుస్తోంది. ఈనేపధ్యం లో అక్కడే ఉన్న తెలుగు దేశం నేతలు మీరెవరూ ఇక్కడికెందుకొచ్చారు పర్మిషన్ ఉందా అని అడిగితే వారి వద్ద సమాధానం లేదు. మేము డ్రోన్ వీడియోల తీస్తామని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మేమే తీశామని, జగన్మోహనరెడ్డి పంపించరని ఒకరు. కాదు జగనన్న దగ్గరుండే కిరణ్ పంపించారని మరొకరు చెప్పారు.దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే కిరణ్ ఎవరు అన్నది మాత్రం తెలియట్లేదు మరోపక్క విషయం తెలియడంతో పోలీసులు వచ్చి అతన్ని మేము విచారణ చేస్తామని తీసుకెళ్తున్న టైమ్ లో తెలుగు దేశం నేతలు అడ్డుపడ్డారు.


అసులు వాళ్లెవరో ఎందుకు ఇక్కడికొచ్చారు ఇవన్నీ చెప్పకుండా మీరు తీసుకెళ్లడానికి వీలు లేదని ఆందోళన చేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత వాళ్లు మావాళ్లే అంటూ జనవనం శాఖాధికారులు చెప్పారు. వరద అంచనాకోసమే పంపించమని చెప్పారు. అయితే వాళ్ల ఐడీకార్డులూ అడిగితే మాత్రం లేవని చెప్పారు. ఇక మరో పక్క వీడియో కేవలం చంద్రబాబు ఇంటి వద్ద మాత్రమే ఎందుకు తీస్తున్నారు మిగతా చోట్ల ఎందుకు తీయట్లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. చంద్రబాబు ఎంటీసీ భద్రతా సిబ్బందిలో ఉన్నారు. ఆయన నివాసం వద్ద డ్రోన్ లేపి ముందు ఎన్ఎస్టీ యొక్క పర్మిషన్ తీసుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానం లేదు.


దీని మీద చంద్రబాబు నిజంగానే సీరియస్ అయ్యారని తన ఆరోగ్యం బాగలేక చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే హైదరాబాద్ లో తాను విశ్రాంతి తీసుకున్నటువంటి ఈ సమయంలో తన ఇంటి ముందు డ్రోన్ లు తిప్పడం ఎంటనీ, ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడంతో ఆయన చాలా  సీరియస్ అయ్యారని తెలిసింది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు మాత్రం ఆయనకి కేంద్రాన్ని పంపించి అమిత్ షాకి ఒకే ఒక్క ఫోన్ చేశారని సమాచారం తెలుస్తోంది.


అమిత్ షా కూడా దీని మీద సీరియస్ ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన హోంమంత్రి కాబట్టి ఏదేమైనా ఈ విషయంలో చంద్రబాబు కేంద్రం కుట్ర జరుగుతోందంటే తెలియజేయాలని సమాచారం. చాలా ఊర్లు మునిగిపోయి ప్రజలు అంతా దిక్కు తోచని స్థితిలో ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నివాసం పై ప్రభుత్వం పెడుతున్నశ్రద్దని చూస్తే  చంద్రబాబు పై ఉన్న అభిమానం అనుకోవాలో లేక కక్ష సాధింపు చర్య అనుకోవాలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటికి ఏమి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: